ఆ యాప్స్‌తోనే నాకు సంబంధం.. విచారణలో అన్నీ ఓపెన్ అయ్యా.. విజయ్ దేవరకొండ

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వివాదం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది. డజనుకుపైగా టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి లాంటి సినీతారల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ వివాదంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో పలువురికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ED) విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు. మీడియాలో రాస్తున్నట్టు, స్క్రోలింగ్ వేస్తున్నట్టు నేను బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు నన్ను విచారణకు పిలువలేదు. నేను గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశాను. వాటి గురించి విచారణ అధికారులకు నేను వివరణ ఇచ్చాను. కాబట్టి మీరు మీ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనే విషయాన్ని తీసేసి.. గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో నేను విచారణకు హాజరయ్యానని మీరు మార్చాలి. నా కోసం మీరు ఆ పని చేయాల. ఎందుకంటే.. గేమింగ్ యాప్స్ దేశంలో రిజిస్టర్డ్. అవి చట్టవ్యతిరేకం కాదు అని ఆయన తెలిపారు.

Vijay Deverakonda ED Probe on betting Apps

ఈ వివాదంలో నా పేరు ఎందుకు వచ్చిందో వారికే తెలియదు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వేరు. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఉంది. రాష్ట్రప్రభుత్వాలు కూడా అనుమతించాయి. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా.. గూగుల్‌కు వెళ్లి టాప్ 10 గేమింగ్ యాప్స్ అని టైప్ చేయండి. అవి ఏమిటో మీకు తెలుస్తుంది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

గూగుల్‌లోకి వెళితే.. కొన్ని గేమింగ్ యాప్స్ వస్తాయి. అలాంటివి రిజిస్టర్డ్ యాప్స్. మన క్రికెట్ టీమ్‌కు, ఒలంపిక్ టీమ్‌కు, ఇతర స్పోర్ట్స్‌కు స్పాన్సర్లుగా ఉన్నాయి. ఐపీఎల్, కబడ్డీ, వాలీబాల్ లీగ్స్‌కు వారు స్పాన్సర్‌ చేస్తారు. ఈ వివాదంలో నా పేరు వచ్చింది కాబట్టి.. నేను వివరణ ఇచ్చాను. నా బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు సమర్పించాను. ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలికాం అని విజయ్ దేవరకొండ చెప్పారు.

సాధారణంగా లీగల్ స్టేటస్ ఉన్న యాప్స్‌కు జియో లాక్ ఉంటుంది. మన దేశంలో చట్ట వ్యతిరేకం అయితే అవి ఓపెన్ కావు. చట్టబద్దంగా నడిచే యాప్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. అవే ఓపెన్ అవుతాయి. చట్ట వ్యతిరేకంగా నడిచే యాప్స్ తెలంగాణలో ఓపెన్ కావు. ఒకవేళ ఒపెన్ అయినా.. ఈ ఏరియాలో పనిచేయవు అనే మెసేజ్ వస్తుంది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

నేను మీ ముందు ఏవైతే వివరాలు చెప్పానో.. అధికారులకు అవే విషయాలు చెప్పాను. బ్యాంక్ డీటైల్స్, ఏజెన్సీ వివరాలు, స్పాన్సర్ యాప్స్ విషయాలు వారికి అందజేశాను. నేను ఇచ్చిన వివరణపై అధికారులు సంతృప్తి చెందారు. త్వరలోనే మీకు వారు అధికారికంగా వెల్లడిస్తారు. బెట్టింగ్ యాప్స్‌ను అనుమతించాలా? వద్దా? అనేది సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలపై ఆధారపడి ఉంటుంది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X