విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా టైటిల్ ఏంటీ?.. ఆయన వల్లే ఆలస్యమా..!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో హీరో నానికి ఫ్రెండ్ పాత్రలో నటించి తొలిసారిగా తెలుగు ఆడియెన్స్ కు వెండితెరపై పరిచయం అయ్యారు. అంతకు ముందు ఓ చిత్రంలో నటించినా పెద్దగా ఫలితం లేదు. ఆ తర్వాత 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషనల్ గా మారిన విజయం తెలిసిందే. సందీప్ రెడ్డి డాషింగ్ డైరెక్షన్, విజయ్ అగ్రెసివ్ పెర్ఫామెన్స్ తో దెబ్బకు ఇండస్ట్రీ షాక్ అయ్యింది. అర్జున్ రెడ్డితో మొదటి బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకున్నాడు విజయ్.
అయితే, ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో 'గీతాగోవిందం' మినహా ఏదీ ఆశించిన మేర ఫలితానివ్వలేదు. ఇక 'లైగర్' వంటి చిత్రాలు ఎలాంటి రిజల్ట్ ను అందించిందో తెలిసిందే. ఏదేమైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విజయ్ దేవరకొండ మాత్రం హిట్ కొట్టేందుకు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే నెక్ట్స్ లైనప్ ను సెట్ చేసి పెట్టారు. రాబోయే చిత్రాలను మరింత శ్రద్ధగా ఆడియెన్స్ ను మెప్పించేలా చేస్తున్నారు. ఇక విజయ్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రం VD12. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ'తో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మెళకువలతో ఆడియెన్స్ కు కొత్తదనం చూపించగలిగారు. ఇప్పుడు అదే ఆశ విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న VD12పై ఉంది. దీంతో విజయ్ దేవరకొండకు హిట్ పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టైటిల్ పోస్టర్, అలాగే రిలీజ్ డేట్ కోసం అంతా వేచి చూస్తున్నారు.
ఇప్పటికే విజయ్ అభిమానులు నిర్మాత సూర్య దేవర నాగవంశీని సోషల్ మీడియా వేదికగా పలుమార్లు టైటిల్ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఓ దశలో ఇబ్బంది కూడా పెట్టారు. దాంతో ఆయన టైటిల్ ఫిక్స్ చేశామని ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. ఇక నిన్నటి నుంచి మంచి అనౌన్స్ మెంట్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నాగవంశీని ట్యాగ్ చేస్తూ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ చిత్రానికి రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

కింగ్ డమ్, సామ్రాజ్యం అనే రెండు టైటిళ్లు వీడీ12 సినిమా టైటిల్ కోసం పరిశీలించినట్టు, వీటిలో ఒకటి ఫైనల్ అయ్యిందని టాక్ వస్తోంది. మోస్ట్లీ సామ్రాజ్యం టైటిల్ ను ఖరారు చేసినట్టు టాక్. అలాగే రిలీజ్ డేట్, టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారని, అయితే సంగీత దర్శకుడు అనిరుధ్ నుంచి రావాల్సిన అవుట్ పుట్ వల్లే కాస్తా సమయం పడుతుందని అంటున్నారు. ఏదేమైనా ఇవ్వాలో, రేపో అప్డేట్ మాత్రం దిగుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











