అనసూయపై కోపం లేదు.. క్షమించేశా.. విజయ్ దేవరకొండ.. కానీ ఫ్యాన్స్ లొల్లి లొల్లి!

సినిమా పరిశ్రమ, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సామెత తరుచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం మీకు మాత్రమే చెప్తా సినిమా చూసినా గానీ.. విజయ్ దేవరకొండను చూస్తే ఆ విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ హీరోగా నిలదొక్కుకొనే సమయంలో.. అర్జున్ రెడ్డి విడుదలైన నేపథ్యంలో అనసూయ ఆ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయినా తాను తొలిసారి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సినిమాలో అనసూయకు అవకాశం ఇవ్వడంపై ఇటీవల విజయ్ దేవరకొండను ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇంతకు వారి మధ్య వివాదం ఏమిటంటే..

అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో

అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో

అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఓ బూతు మాటను సెన్సార్ అధికారులు తొలగించడంపై కామెంట్ చేస్తూ ఆ పదాన్ని వేదిక మీద నుంచి ఉచ్చరించడంపై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది. లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్న ఓ హీరో వేదికపై అలాంటి కామెంట్లు చేయడం సరికాదు అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది. అలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యం అంటూ కామెంట్ చేసింది.

నాకు క్షమించే గుణం ఎక్కువ

నాకు క్షమించే గుణం ఎక్కువ

యాంకర్ అనసూయ చేసిన కామెంట్ గురించి ప్రస్తావిస్తూ.. నేను కొన్ని విషయాలు పట్టించుకోను. నాకు క్షమించే గుణం ఎక్కువ. అది కాకుండా నా సొంత సినిమాలో అనసూయను తీసుకోవాలనే విషయం డైరెక్టర్ నిర్ణయం మాత్రమే. ఆ పాత్రకు ఆమె కావాలని అడిగారు. నేను అందుకు ఒకే అన్నాను అని విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చారు.

 నేను డైరెక్టర్ అయితే

నేను డైరెక్టర్ అయితే

వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి. ఒకవేళ నేను డైరెక్టర్ అయితే అనసూయను తీసుకొనే వాడిని కాదో చెప్పలేను. కానీ నేను ఈ సినిమాకు డైరెక్టర్‌ను కాదు కాబట్టి.. అది నా నిర్ణయం కాదు. కేవలం పాత్ర స్వభావాన్ని బట్టి డైరెక్టర్ ఎంపికకే వదిలి వేశాం. నేను ఎన్నడూ షూటింగ్‌కు వెళ్లలేదు. అంతా వాళ్లే చూసుకొన్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు.

 అనసూయ అద్భుతంగా

అనసూయ అద్భుతంగా

మీకు మాత్రమే చెప్తా సినిమాలోని పాత్రను అనసూయ అంగీకరించడం నాకు చాలా హ్యాపీ. ఆమె సినిమాలో అద్భుతంగా నటించారు. ఆమెకు మంచి సక్సెస్ లభించాలని, పేరు తీసుకురావాలని కోరుకొంటాను. ఆ పాత్ర గురించి, సినిమా కథ చెప్పిన విధానంతోనే నేను ఈ సినిమా నిర్మించాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.

ఫ్యాన్స్ లొల్లి.. లొల్లి

ఫ్యాన్స్ లొల్లి.. లొల్లి

కాగా, అనసూయ ఉదంతం విజయ్ దేవరకొండ లైట్ తీసుకొన్నప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం మరిచిపోలేదు. మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అనసూయ మాట్లాడానికి వేదికపైకి వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లొల్లి లొల్లి చేశారు. ఆమెను మాట్లాడకుండా అడ్డుకోవడంతో రెండు ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

పాజిటివ్ ఓపెనింగ్స్

పాజిటివ్ ఓపెనింగ్స్

కాగా, మీకు మాత్రమే చెప్తా సినిమా నవంబర్ 1 రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ చిత్రానికి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. కామెడీ చిత్రంగా రూపొందిన మీకు మాత్రమే చెప్తాకు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ ఓపెనింగ్స్ వస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X