పెళ్లి గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ.. నాకంటే వాడికే ముందంటూ అసక్తికర వ్యాఖ్యలు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఆనంద దేవరకొండ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు చేసి, రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఆయన కరోనా సెకండ్ వేవ్ రోజుల్లోనే సినిమా ప్రారంభించాడు. తన మొదటి సినిమా 118 తోనే సూపర్ హిట్ సాధించిన దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నారు. అయితే ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

దేవరకొండ నిర్మాతగా

దేవరకొండ నిర్మాతగా

ఆనంద్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్పకవిమానం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో ఆనంద్‌ అమాయకుడైన ఒక యువకుడి పాత్రలో నటించారని అంటున్నారు. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహించారు.

కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ లో

కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ లో

ఆనంద్ దేవ‌ర‌కొండ మూడో సినిమాగా 'పుష్పక విమానం' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మెరిసిన శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటిస్తుండగా సునీల్, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను విజయ్‌ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ లో నిర్మించారు.

స్పెషల్‌ ప్రోమో

స్పెషల్‌ ప్రోమో

అయితే ఈ 'పుష్పకవిమానం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌ లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలు గురించి అన్నదమ్ములిద్దరూ సరదాగా పంచుకున్నారు. ఇక ఈ చిట్ చాట్ గురించి వివరిస్తూ తాజాగా విజయ్‌ ఓ స్పెషల్‌ ప్రోమో షేర్‌ చేశారు. ''స్కూల్‌లో చదువుకునే రోజుల్లో హాస్టల్ నుంచి వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లమని, రెండు నెలలు ఇంట్లో సరదాగా ఉండేవాళ్లమని అన్నారు.

చుక్కలు చూపించేవాడు

చుక్కలు చూపించేవాడు

కానీ ఆనంద్‌ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు. నన్ను బాగా విసిగించేవాడని విజయ్‌ చెప్పగానే.. ఆనంద్‌ నవ్వులు రువ్వ్వుతూ కనిపించారు. అనంతరం విజయ్‌.. ''నాకంటే ముందు ఆనంద్‌కే పెళ్లి అవుతుంది'' అనగానే.. ''నో అన్నయ్యకే ముందు'' అని ఆనంద్‌ సైగలు చేయడం అస్కతికరంగా మారింది. ఇక ''అమ్మ ఫేవరెట్ ఎవరు ? అంటే దానికి సమాధానం చెబుతూ.. తానే అన్నట్లు ఇద్దరూ చెప్పుకొచ్చారు.

వాడికే ముందు పెళ్లి

వాడికే ముందు పెళ్లి

తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్‌ దేవరకొండకే వివాహం జరుగుతుందని టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. అలా సరదాగా సాగిన దేవరకొండ సోదరుల ఫన్నీ ఇంటర్వ్యూ పూర్తి వీడియో సోమవారం విడుదల చేయనున్నారు. ఇక గుహన్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పేరు హైవే. వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో సాగుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఒక సైకో కిల్లర్ తరహా క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇక పుష్పక విమానంతో ఆనంద్ కు బ్రేక్ వస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X