కార్తీకేయ నా స్నేహితుడు.. రాజా విక్రమార్కకు సపోర్ట్ చేయండి.. సహృదయాన్ని చాటుకొన్న విజయ్ దేవరకొండ

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి నిర్మించిన తాజా చిత్రం పుష్పక విమానం. కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్‌మెంట్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, గీత్, శాన్వీ మేఘన హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన సోదరుడు ఆనంద్, దర్శకుడు సృజన్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా యువ హీరో కార్తీకేయ గుమ్మకొండ నటించిన రాజా విక్రమార్క సినిమా గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నానని అని విజయ్ దేవరకొండ మాట్లాడుతూ...

నవంబర్ 12వ తేదీన పుష్పక విమానం సినిమాతోపాటు కార్తీకేయ నటించిన రాజా విక్రమార్క సినిమా కూడా రిలీజ్ అవుతున్నది. ఆ సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకొంటున్నాను. కార్తీకేయ నాకు చాలా మంచి ఫ్రెండ్. కార్తీకేయ నేను జిమ్‌లో చాలా కష్టపడ్డాం. అతడికి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకొంటాను. కార్తీకేయ, రాజా విక్రమార్క టీమ్‌కు బెస్టాఫ్ లక్ అంటూ విజయ్ దేవరకొండ ఓ మంచి సందేశాన్ని అందించారు.

మహబూబ్ నగర్‌లో ఏవీడీ అనే సినిమా థియేటర్‌ను నిర్మించాను. 12వ తేదీ ఉదయం నేను అమెరికాకు వెళ్తున్నాను. అంతకు ముందే 11 రాత్రి పుష్పక విమానం సినిమాను అందులో వేస్తున్నాం. మీ అందరితో కలిసి నేను సినిమా చూడాలని అనుకొంటున్నాను. కాబట్టి మీరందరూ బుక్ మై షో ద్వారా పుష్పక విమానం సినిమా టికెట్ బుక్ చేసుకోండి. ఈ ప్రీమియర్ షోకు నాతోపాటు సినిమా యూనిట్ అంతా వస్తుంది. కాబట్టి మీరంతా నాతో కలిసి సినిమా చూడండి. ఇంత వరకు నేను ఏవీడీలో సినిమా చూడలేదు. కాబట్టి మీతో కలిసి సినిమా చూడాలని అనుకొంటున్నాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

 Vijay Deverakonda kind gesture about Hero Kartikeya at Pushpaka Vimanam Pre Release Event

ఇక ఏపీ పోలీసులు దిశ యాప్ గురించి నన్ను ఓ సహాయం అడిగారు. మహిళలందరూ దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పమన్నారు. దయచేసి దిశ యాప్‌ను మహిళందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలి నేను కోరుతున్నాను. మహిళలకు ఈ యాప్ వాడే అవకాశం రావొద్దని కోరుకొంటున్నాను. కానీ సేఫ్ సైడ్‌గా మీ వద్ద ఉంచుకోమని కోరుతున్నాను. ఏదైనా ఆపద వస్తే పోలీసుల త్వరగా స్పందిస్తారు అని విజయ్ దేవరకొండ తెలిపారు.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, భద్రం, సుదర్శన్, వీకే నరేష్ తదితరులు
సమర్పణ: విజయ్ దేవరకొండ
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్,
ఎడిటర్ : రవితేజ గిరిజాల
మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.
కాస్టూమ్స్ : భరత్ గాంధీ
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర
బ్యానర్స్: కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్
పీఆర్‌వో: జీఎస్‌కె మీడియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X