విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన అనిరుధ్.. థియేటర్లు బద్దలే
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. చివరిగా 'ఖుషి', 'ఫ్యామిలీ స్టార్' చిత్రాలతో అలరించిన రౌడీ స్టార్ నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కింగ్డమ్' చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మే30న విడుదల కానుండటంతో ప్రమోషనల్ మెటీరియల్ తో సినిమాపై హైప్ పెంచుతున్నారు. అందుతున్న అప్డేట్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయ్ దేవరకొండ చివరి చిత్రాలు..
అర్జున్ రెడ్డి తర్వాత అంతటి భారీ సక్సెస్ విజయ్ దేవరకొండకు అందలేదనే చెప్పాలి. గీతా గోవిందం తప్ప చెప్పుకోదగిన సినిమాలేవీ లేవు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లైగర్'చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై భారీ వైఫల్యాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన 'ఖుషి' చిత్రంతో మళ్లీ హిట్ అందుకున్నారు. చివరిగా వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రంతో కూడా ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు.

'కింగ్డమ్' పైనే దేవరకొండ ఆశలు..
వరుస చిత్రాలు అందించిన ఫలితాలతో సక్సెస్ రేట్ లో కాస్తా వెనకబడి ఉన్నారు. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని, తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో 'జెర్సీ' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నదర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న 'కింగ్డమ్' సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్ తో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది మరింత ఆసక్తికరంగా మారింది.
అనురుధ్ ఇచ్చిన రివ్యూ..
గౌతమ్ తిన్ననూరి - నాని కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జెర్సీ' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న కింగ్డమ్ చిత్రానికి కూడా ఆయనే సంగీత దర్శకుడు కావడం విశేషం. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు బీజీఎం, మ్యూజిక్ ను కంప్లీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనిరుధ్ కింగ్డమ్ మూవీ చిత్రంలోని చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని తాజాగా చెప్పారు. యాక్షన్ సీన్స్, విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ బాగుందని తన విశ్లేషణ చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.
కింగ్డమ్ మూవీ బడ్జెట్, నటీనటులు..
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భారీ స్కేల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రూ.110 కోట్ల బడ్జెట్ ను వెచ్చించారు. భాగ్యశ్రీ భోర్స్లే హీరోయిన్ గా నటిస్తోంది. గిరిష్, జోమన్ సినిమాటోగ్రఫీగా, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్ గా బాధ్యతలు చూస్తున్నారు. ప్రముఖ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











