Kushi: విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డ్.. అన్ని లొకేషన్లలో 'ఖుషి' రిలీజ్
చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్ చేస్తూ రౌడీ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో మంచి క్రేజ్ తోపాటు భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో పేరు తెచ్చుకున్న వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇటీవల లైగర్ తో ప్లాప్ చూసిన విజయ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ సినిమా ఖుషి (Kushi 2023). ఈ సినిమాతో తన కెరీర్ లో అత్యంత బిగ్గెస్ట్ రికార్డ్ ను అందుకున్నాడు విజయ్ దేవరకొండ.
రౌడీ హీరో ద విజయ్ దేవరకొండ, దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత మరోసారి కలిసి నటించిన చిత్రం ఖుషి (Kushi). ఇంతకుముందు వీరిద్దరూ మహానటి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో సమంత వెంటపడే ప్రేమికుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ ఫుల్ టైమ్ పెయిర్ గా నటిస్తున్న ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ చిత్రాలకు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఖుషి సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. హృదయం మూవీతో ఆకట్టుకున్న హేషమ్ తెలుగులో ఖుషి సినిమాతో డెబ్యూ చేశారు. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెరిగగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఆగస్ట్ 9న రిలీజైన ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది.
ఇదిలా ఉంటే ఖుషి సినిమాతో తన కెరీర్ లోనే గొప్ప మైలు రాయిని సాధించాడు విజయ్ దేవరకొండ. నార్త్ అమెరికాలో (అమెరికా+కెనడా) ఖుషి సినిమాను తెలుగులో ఏకంగా 500కుపైగా లొకేషన్లలో విడుదల చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో రిలీజ్ కావడం అనేది విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ టైమ్.

ఇదివరకు గీత గోవిందం సినిమాను నార్త్ అమెరికాలో రిలీజ్ చేసిన శ్లోకా ఎంటర్టైన్ మెంట్స్ ఖుషిని కూడా విడుదల చేయడం విశేషం. కాగా ఖుషి సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలో సందడి చేయాడానికి రెడీగా ఉండగా.. ఆగస్ట్ 31నే యూఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. మరి విజయ్ దేవరకొండ ఖుషి సినిమా అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











