Vijay Devarakonda Net Worth: రష్మికతో పెళ్లి.. విజయ్ దేవరకొండ నెట్‌వ‌ర్త్ ఎన్ని కోట్లంటే?

Vijay Devarakonda Net Worth: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా పెళ్లి చేసుకోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారట. ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్-రష్మిక తొలిసారి తమ పెళ్లిపై అధికారికంగా స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టులు పెట్టారు. అభిమానులు ప్రేమగా పిలుస్తున్నట్టుగానే తమ పెళ్లికి 'విరోష్ (VIROSH)' అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా నెట్టింట సెర్చ్‌లు పెరిగిపోయాయి. విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్, నెట్ వర్త్, లగ్జరీ కార్లు, లైఫ్‌స్టైల్ వంటి అంశాలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నెట్‌వ‌ర్త్ ఎన్ని కోట్లంటే?

'అర్జున్ రెడ్డి' నుంచి నేషనల్ స్టార్ వరకూ
చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది అర్జున్ రెడ్డి. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా విజయ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసింది. ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్, నో-ఫిల్టర్ యాటిట్యూడ్, బోల్డ్ పబ్లిక్ ఇమేజ్‌తో యువతలో భారీ ఫాలోయింగ్ సంపాదించారు. సపోర్టింగ్ రోల్స్ నుంచి లీడ్ హీరో స్థాయికి ఎదిగిన ఈ ప్రయాణం అంత ఈజీ కాకపోయినా- టైమింగ్, టాలెంట్, అంబిషన్ కలిసి విజయ్‌ను టాప్ లీగ్‌లో నిలబెట్టాయి. ఫిల్మ్‌ఫేర్ సౌత్, నంది,సైమా వంటి అవార్డులతో పాటు ఫోర్బ్స్ సెలబ్రెటీల లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం ఆయన కమర్షియల్ స్ట్రెంత్‌కు నిదర్శనం.

Vijay Deverakonda Net Worth Wedding With Rashmika Luxury Cars House Income Details

రష్మికతో పెళ్లి
ఎన్నో ఏళ్లుగా విజయ్-రష్మిక రిలేషన్‌షిప్ రూమర్స్‌కు ఇప్పుడు పెళ్లి ప్రకటనతో ఎండ్ పడనున్నది. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్‌పూర్ సమీపంలోని లగ్జరీ రిసార్ట్‌లో చాలా ప్రైవేట్‌గా వివాహ వేడుక జరగబోతోందట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని టాక్. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం గత ఏడాదే వీరిద్దరూ సీక్రెట్‌గా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారట. అధికారికంగా ఇప్పుడే ప్రకటించినా, ఇద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం తెలిసిందే.

లగ్జరీ కార్లు, హైఎండ్ లైఫ్‌స్టైల్
విజయ్ దేవరకొండ గ్యారేజ్ అంటే మినీ లగ్జరీ ఆటో షోరూమ్ అన్నట్టే ఉంటుంది. అందులో అమెరికన్ మసిల్ కార్‌గా ప్రసిద్ధి చెందిన ఫోర్డ్ మస్టాంగ్ (సుమారు రూ.75 లక్షలు) ఆయన కలెక్షన్‌లో స్పెషల్ ఆట్రాక్షన్. జర్మన్ లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన జీఎల్‌సీ మోడల్ ( రూ. 60 లక్షలు) కూడా విజయ్ వద్ద ఉంది. అలాగే.. వోల్వో ఎక్స్‌సీ90 (రూ.90 లక్షల నుంచి రూ.1.3 కోట్లు). అదేవిధంగా ల్యాండ్ రోవర్‌కు చెందిన రేంజ్ రోవర్ (దాదాపు రూ.60 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు (రూ.60 లక్షలు)వంటి లగ్జరీ కలెక్షన్‌ ఉన్నాయి. మొత్తం మీద విజయ్ దేవరకొండ కార్ల ప్రపంచం ఆయన స్టార్‌డమ్, స్టేటస్‌ను ప్రతిబింబిస్తోందని చెప్పవచ్చు. అంతేకాదు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పరిసరాల్లో సుమారు రూ. 15 కోట్ల విలువైన లగ్జరీ హౌస్‌లో నివసిస్తున్నారు.

విజయ్ దేవరకొండ అంచనా నెట్ వర్త్ ప్రస్తుతం రూ. 70 కోట్లు ఉంటుందని ట్రేడ్ టాక్. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా భారీ ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక్క ఎండార్స్‌మెంట్‌కే దాదాపు రూ. 1 కోటి వరకు ఛార్జ్ చేస్తున్నారన్న సమాచారం. నటుడిగా మాత్రమే కాదు.. Rowdy Wear అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా రన్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ టీమ్‌కు సహ యజమానిగా ఉన్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రైవేట్ జెట్ కూడా ఉందన్న ప్రచారం నడుస్తోంది.

ఒకవైపు భారీ సినిమాలు... మరోవైపు పెళ్లి హడావుడి... ఈ రెండింటితో 2026 విజయ్ దేవరకొండ జీవితంలో కీలక సంవత్సరంగా మారబోతుందని అభిమానులు భావిస్తున్నారు. మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈ యంగ్ హీరో .. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో రష్మిక ఏంట్రీతో కొత్త అధ్యాయం మొదలుపెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X