Krishnam Raju No more: కృష్ణంరాజు భౌతికకాయానికి విజయ్ దేవరకొండ నివాళి.. ప్రభాస్ ఫ్యామిలీని ఓదారుస్తూ..

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆదివారం రోజు ఉదయం 3:25 నిమిషాలకు కృష్ణంరాజు కన్నుముసిన విషయం తెలిసిందే. ఇక ఆయన మృతి వార్త గురించి తెలియగానే చాలామంది సినీ ప్రముఖులు వారి ఇంటికి చేరుకొని ప్రత్యేకంగా కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. ఇక ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన పలువురు సినీ ప్రముఖులు స్టార్ హీరోలు రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకంగా కలుసుకొని సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Vijay Deverakonda pays homage to Rebel Star KrishnamRaju garu

ఇక యువ హీరో విజయ్ దేవరకొండ కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించి ప్రభాస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొద్దిసేపటి వరకు కృష్ణంరాజు ఇంటి దగ్గరే ఉన్న విజయ్ దేవరకొండ వారి కుటుంబ సభ్యులను కూడా కలుసుకొని తన సంతాపాన్ని తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకే చాలామంది సినీ ప్రముఖులు కృష్ణంరాజు స్వగృహానికి చేరుకొని నివాళులర్పించడం జరిగింది.

Vijay Deverakonda pays homage to Rebel Star KrishnamRaju garu

మొదట చిరంజీవి మోహన్ బాబు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే మరి కొంతమంది యువ హీరోలు కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇక ప్రభాస్ కూడా ఈ సమయంలో చాలా కంటతడి పెట్టుకున్న పలు వీడియోలు ఫోటోలు కూడా అభిమానులను కదిలిస్తున్నాయి. ప్రభాస్ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులు కూడా ఈ బాధ నుంచి కోలుకోవాలని భగవంతుడు వారికి మరింత బలన్ని ఇవ్వాలి అని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Vijay Deverakonda pays homage to Rebel Star KrishnamRaju garu

చాలామంది ఈరోజు షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ పక్కనపెట్టి కృష్ణంరాజు స్వగృహానికి చేరుకుంటున్నారు. ప్రభాస్ కూడా ఇటీవల ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన కొన్ని ఫ్రీ ప్రొడక్షన్ పనుల కోసం చిత్ర యూనిట్ సభ్యులతో ప్రత్యేకంగా మీటింగ్స్ ఏర్పరచుకున్నప్పటికీ ఇప్పుడు వాటిని క్యాన్సల్ చేసుకున్నాడు. అలాగే ప్రాజెక్టు కే షూటింగ్ కూడా కొనసాగుతోంది. అయితే పెదనాన్న పరిస్థితి సీరియస్ గా ఉంది అని అన్నప్పుడే ప్రభాస్ తన షూటింగ్ పనులను కూడా క్యాన్సిల్ చేసుకుని గత రెండు రోజులుగా వైద్యులతోనే సంప్రదింపులు జరిపాడు. తప్పకుండా కృష్ణంరాజు గారు ఆరోగ్యం సెట్ అవుతుందని అనుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో కన్నుమూశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X