‘దొరసాని’ దర్శకుడితో చేయడానికి ఇద్దరు స్టార్ హీరోలు సై
'దొరసాని' సినిమాతో కెవిఆర్ మహేంద్ర పేరు మీడియాలో పాపులర్ అయింది. ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ తీసిన ఇతడు ఈ సినిమా ద్వారా మెయిన్ స్ట్రీమ్ దర్శకుడిగా అడుగు పెడుతున్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఇద్దరు స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధం అంటూ ప్రకటనలు చేయడం చర్చనీయాంశం అయింది.
హైదరాబాద్‌లో జరిగిన 'దొరసాని' ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... 'తాను ఈ సినిమా చూశానని, కెవిఆర్ మహేంద్ర సినిమా అద్భుతంగా తీశారని ప్రశంసలు గుప్పించారు. ఆయన నాకోసం స్క్రిప్టు రాస్తున్నట్లు విన్నాను... పూర్తయిన వెంటనే అది పట్టుకుని నా వద్దకు రండి, తప్పకుండా మనం సినిమా చేద్దాం' అని వ్యాఖ్యానించారు.

మరో సీనియర్ హీరో రాజశేఖర్ మాట్లాడుతూ... తన కోసం కూడా మహేంద్ర ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని తెలిపారు. మొత్తానికి కెవిఆర్ మహేంద్ర తర్వాతి చిత్రం విజయ్ దేరవకొండ లేదా రాజశేఖర్ హీరోగా చేసే అవకాశం ఉందనే న్యూస్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.
'దొరసాని' సినిమా విషయానికొస్తే... ఇందులో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. 1980ల నాటి కథతో తెరకెక్కిన లవ్ స్టోరీ ఇది. మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











