Virosh: గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్- రష్మిక.. ఆ రికార్డు బద్దలైంది!
Vijay Deverakonda-Rashmika: సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా.. తాజాగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఒక ప్యాలెస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.పెళ్లి తర్వాత ఈ జంటకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వీరు కలిసి చేసిన ఒక ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
'విరోష్'జంటకు భారీ క్రేజ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటను అభిమానులు ప్రేమగా 'విరోష్' అని పిలుస్తుంటారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు, పబ్లిక్ అపియరెన్సెస్ కారణంగా అభిమానుల్లో ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించారు. ఇటీవల ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

గ్లోబల్ రికార్డ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన మాన్యవార్ (Manyavar) ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ చేసిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి అయిన మరుసటి రోజు విడుదలైన ఈ యాడ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియో పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ సాధించి ప్రపంచ స్థాయి రికార్డ్ నెలకొల్పింది. ఈ పోస్టుకు ఇప్పటికే 8.3 మిలియన్లకు లైక్స్ వచ్చాయి.
ఈ యాడ్ పోస్టు గతంలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన లియోనల్ మెస్సీ (Lionel Messi), క్రిస్టోయోనో రినాల్డో కలిసి చేసిన లూయిస్ విట్టన్ (Louis Vuitton) యాడ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఈ పోస్టు లైక్స్ విషయంలో అధిగమించిందని సోషల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి విజయ్ - రష్మిక జంటకు ఉన్న ప్రపంచవ్యాప్త క్రేజ్‌ను స్పష్టంగా తెలుస్తోంది.
రష్మిక పెళ్లి ఫోటోలు కూడా రికార్డే
పెళ్లి అనంతరం రష్మిక మందన్న తన వివాహ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పోస్టు కూడా భారీ రికార్డును సృష్టించింది. రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలకు 28 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది ఆసియా స్థాయిలో ఒక సెలబ్రిటీ ఫోటోకు వచ్చిన అత్యధిక లైక్స్‌లో ఒకటిగా చెప్పబడుతోంది. దీంతో సోషల్ మీడియాలో రష్మికను అభిమానులు 'క్వీన్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్' అని కూడా పిలుస్తున్నారు.
ఇంతకు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఆసియాలో అత్యధిక లైక్స్ సాధించిన రికార్డుగా నిలిచింది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని ముద్దాడుతున్న ఫోటోను కోహ్లీ షేర్ చేయగా ఆ పోస్టుకు 22 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు రష్మిక పెళ్లి ఫోటో ఆ రికార్డును కూడా అధిగమించిందని సోషల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు విజయ్ దేవరకొండ షేర్ చేసిన పెళ్లి ఫోటోకు కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. రష్మిక చేయి పట్టుకుని ఉన్న ఫోటోను విజయ్ షేర్ చేయగా, ఆ పోస్టుకు 20 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఒక అరుదైన డిజిటల్ మైలురాయిగా చెప్పుకోవచ్చు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా విజయ్ - రష్మిక జంటకు భారీ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి తర్వాత ఈ జంటపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications











