Vijay- Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అలాంటి సర్‌ప్రైజ్, ఇండియా వైడ్‌గా భారీ ప్లాన్

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, కొడవ సాంప్రదాయాల ప్రకారం విజయ్- రష్మికలు ఒకేరోజున రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. అయితే మార్చి 4న సినీ, రాజకీయ, ఇతర ప్రముఖుల కోసం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు విజయ్- రష్మిక. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే దీని కంటే ముందు మరో భారీ కార్యక్రమానికి విజయ్ - రష్మికలు ప్లాన్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఉదయ్‌పూర్‌లో పెళ్లి తర్వాత తమ వెడ్డింగ్ పిక్స్‌ను విజయ్- రష్మికలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలారోజుల తర్వాత సినీ పరిశ్రమ నుంచి జరుగుతున్న భారీ ఈవెంట్ కావడంతో స్థానిక, జాతీయ మీడియాతో పాటు ప్రజలు విరోష్ వెడ్డింగ్‌పై ఆసక్తి చూపించారు. తద్వారా ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన కొద్దిగంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అలా పలువురు సెలబ్రిటీల రికార్డ్స్‌ను విరోష్ బద్ధలు కొట్టింది. 2024లో టీమిండియా టీ 20 వరల్డ్ కప్‌ను గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైకులు వచ్చాయి. ఈ రికార్డ్‌ను విరోష్ జోడీ బ్రేక్ చేసింది. రష్మిక పోస్ట్‌కు ఏకంగ 25 మిలియన్ల లైక్స్ వచ్చాయి.

Vijay Deverakonda-Rashmika Mandanna planned India-wide wedding celebrations sweets distribution and Annadanam at temples

ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న. శంషాబాద్ విమానాశ్రయంలో వీరిద్దరికీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. మరోవైపు.. మార్చి 4న జరగనున్న తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మరికొందరు ప్రముఖులు విరోష్ జంట ఆహ్వానించింది. దాంతో ప్రస్తుతం అందరి చూపు విజయ్ - రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్‌పైనే ఉంది.

మరోవైపు.. దేశంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటి వరకు గ్రాండ్‌గా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు మాత్రం తమ వివాహాన్ని చిరస్మరణీయంగా మార్చాలని అనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇంత వరకు ఏ సెలబ్రిటీ కపుల్ ఆలోచించని విధంగా ప్లాన్ చేసింది ఈ జంట. దేశవ్యాప్తంగా తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగేలా చేసింది. తమను ఈ స్థాయికి తీసుకొచ్చిన దేశ ప్రజల కోసం ఇలా ప్లాన్ చేస్తున్నట్లు విరోష్ జంట తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది

దేశ ప్రజలంతా మా జీవితంలో భాగం. అందుకే మీ అందరితో ఈ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎలాంటి ఈవెంట్ నైనా మనదేశంలో స్వీట్స్, ఫుడ్‌తో సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే మా జీవితంలో అత్యంత ముఖ్యమైన మూవ్‌మెంట్‌ను మీతో కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాం. దీనిలో భాగంగా మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ ట్రక్స్‌ను పంపిస్తున్నాం. అలాగే ప్రముఖ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని విజయ్- రష్మిక తెలిపారు. ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు.. ఏయే దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు అనే లిస్ట్‌ను కూడా విరోష్ జంట షేర్ చేసింది.

స్వీట్స్ పంపిణీ ఎక్కడంటే:
తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌...ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ, పుట్టపర్తి.. ఢిల్లీ, చండీగఢ్.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్.. మహారాష్ట్రలోని ముంబైలో... రాజస్థాన్‌లోని జైపూర్‌లో.. కేరలోని కొచ్చిలో.. కర్ణాటకలోని మైసూర్, కూర్గ్, బెంగళూరు, తమిళనాడులోని కోయంబత్తూరు, చెన్నై... పాండిచ్చేరిలో స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

అన్నదానం జరిగే ఆలయాలు:
కనక మహాలక్ష్మీ ఆలయం (విశాఖపట్నం), కనకదుర్గ ఆలయం (విజయవాడ), ద్వారకా తిరుమల (చిన్నతిరుపతి), శివోహం ఆలయం (బెంగళూరు), శ్రీ చాముండేశ్వరి ఆలయం (మైసూరు), రాధ కృష్ణ ఆలయం (బెంగళూరు), అరుల్ కోమిలమ్మ తిరుకోయిల్ (కోయంబత్తూరు) , చింతపల్లి సాయిబాబా ఆలయం (చింతపల్లి), మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయం (మహబూబ్ నగర్), హరేకృష్ణ హెరిటేజ్ టెంపుల్ (హైదరాబాద్), గోవింద దేవ్ జీ టెంపుల్ (జైపూర్), పాడి ఇగుత్తప్ప టెంపుల్ (కూర్గ్), శ్రీశ్రీ గోవింద దామ్ టెంపుల్ ఇస్కాన్ (అహ్మదాబాద్), శ్రీ రుక్మీణి టెంపల్ (గౌహతి), శ్రీశ్రీ కృష్ణ బలరామ్ మందిర్ (బృందావనం)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X