Vijay - Rashmika: విజయ్- రష్మిక రాయల్ వెడ్డింగ్‌లో భారీ నగలు.. వాటి విలువ ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంట అత్యంత క్రేజీ ఉన్న కపుల్ గా పేరు తెచ్చుకుంది. ఈ జంట ఎన్నో ఎన్నాళ్లుగా తమపై కొనసాగిన రూమార్స్ అన్నింటికి ఒక్కసారిగా చెక్ పెట్టేసింది. ఎట్టకేలకు ఈ జంట వివాహ బంధంలోకి ఒక్కటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అతి సన్నిహితుల సమక్షంలో చాలా గ్రాండ్ గా వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ సెలబ్రెటీ వెడ్డింగ్ పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రష్మిక - విజయ్ జంట ధరించిన ఆభరణాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
రాయల్ లుక్‌లో విరోష్ జంట
ఉదయ్‌పూర్‌లోని లగ్జరీ వేదికపై రష్మిక - విజయ్ ల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో ఈ జంట రాయల్ లుక్‌తో మెరిసిపోయింది. సంప్రదాయం ఉట్టిపడేలా, ఆధునిక స్టైల్‌తో మేళవించిన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఇక వాటికి సరిపోయేలా తయారు చేసిన నగలు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరోయిన్ రష్మిక ధరించిన నక్షీ వర్క్ గోల్డ్ జ్యువెలరీలో దక్షిణ భారత ఆలయ శిల్పకళ ప్రతిబింబించగా, విజయ్ ధరించిన ఆభరణాల్లో పులులు, ఏనుగుల డిజైన్లు ప్రత్యేకంగా కనిపించాయి.

నగల తయారీకి 10 నెలలు
సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ జువెలరీ సంస్థ నగలను తయారు చేసిందట. వీటిని దాదాపు 10 నెలలపాటు ప్రత్యేక శ్రద్ధతో ఈ నగలను రూపొందించిందట. ప్రతి డిజైన్ ను ఎంతో జాగ్రత్తగా, సంప్రదాయం, రాజసం, సింబాలిజం ప్రతిఫలించేలా నక్షీ వర్క్ చేశారట. రష్మిక ధరించిన వడ్డాణం, మంగళసూత్రం, హారం, గాజులు, నెక్లెస్‌లతో కలిపి మొత్తం 11 రకాల నగలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి మొత్తం బరువు సుమారు 1.5 నుంచి 2 కిలోల మధ్య ఉండొచ్చని జాతీయ మీడియా అంచనా వేస్తోంది. ఇక వాటి విలువ రూ.3 నుంచి 5 కోట్ల మధ్య ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇక విజయ్ ధరించిన నగలు బరువు సుమారు అర కిలో వరకూ ఉంటుందట. విజయ్ నగల విలువ రూ.1 నుంచి 2 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా చూస్తే, ఈ జంట నగల విలువ రూ.4 నుంచి 7 కోట్ల మధ్య ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ జంట వివాహం రెండు సంస్కృతుల కలయికగా జరిగింది. విజయ్ తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించగా, రష్మిక కూర్గ్ కొడవ వారసత్వాన్ని చాటేలా ఉన్నాయి. అందుకే నగల డిజైన్‌లో ఆలయ శిల్పకళ, సంప్రదాయ చిహ్నాలు చూడవచ్చు.
ఇక మరో ఆసక్తికర విషయమేమిటంటే? రష్మిక- విజయ్ ల పెళ్లి ఫోటోలు విడుదలై 24 గంటల్లోనే 20మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయంటే.. ఈ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జంట రాయల్ లుక్ చూసిన అభిమానులు 'ఇది నిజంగా రాజ కుటుంబ పెళ్లిలా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా విజయ్ - రష్మిక వివాహం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. స్టైల్, సంప్రదాయం, రాయల్ ఎలిగెన్స్ కలయికగా నిలిచింది. కోట్ల విలువైన నగల చర్చ మరింత వైరల్ అవుతుండటంతో ఈ జంట మరోసారి ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.


Click it and Unblock the Notifications











