Vijay Deverakonda - Rashmika: రష్మిక, విజయ్ దేవరకొండ ఏం చదువుకున్నారో తెలుసా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న వివాహం జరుగుతుందన్న టాక్, అంతేకాకుండా మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయినా ఈ రూమర్స్‌తో పాటు, ఇప్పుడు విజయ్, రష్మిక పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు నెటిజన్లు మరో అంశంపై ఫోకస్ చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు విజయ్, రష్మిక ఏం చదువుకున్నారు?

రష్మిక మందన్న.. బ్యూటీతో పాటు బ్రెయిన్స్ కూడా
కన్నడ సినిమా కిర్రాక్ పార్టీ తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన రష్మిక, తొలి సినిమాతోనే భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఛలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం మూవీతో మరో విజయాన్ని అందుకుంది. ఇలా వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకుంది. ఇక అల్లు అర్జున్ 'పుష్ప'సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే? రష్మిక సినిమాల్లోకి రాకముందు చదువుకే ప్రాధాన్యం ఇచ్చింది.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Buzz Education Details Before Their Stardom

రష్మిక బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి, క్లిన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ వంటి టైటిల్స్ గెలుచుకుంది. అక్కడి నుంచే ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ మొదలైంది. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో బిజీగా ఉంది.

బోర్డింగ్ స్కూల్ నుంచి బాక్సాఫీస్ స్టార్ వరకు
ఇక విజయ్ దేవరకొండ స్టోరీ మరింత ఇన్‌స్పైరింగ్. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల్యంలో ఎక్కువ భాగం కుటుంబానికి దూరంగా గడిపిన విజయ్.. ఏపీలోని పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో బీకాం(Bachelor of Commerce)పూర్తి చేశాడు.

చదువులోనూ టాపర్‌గా నిలిచిన విజయ్... నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాల వైపు అడుగులు వేసాడు. విజయ్ దేవరకొండ 2011లో నువ్విలా సినిమాతో తెరంగేట్రం చేశారు.మొదటి సినిమాలు పెద్దగా వర్క్ అవ్వకపోయినా, 'అర్జున్ రెడ్డి' సినిమా అతని కెరీర్ పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. విజయ్-రష్మిక పెళ్లి వార్తలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం వారి పర్సనల్ లైఫ్‌తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, నెట్ వర్త్ వంటి విషయాలు అభిమానుల్లో చర్చనీయంగా మారాయి.

ఇక మరోవైపు.. రష్మిక-విజయ్ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో రూమార్స్ వస్తున్నాయి. ఈ వైరల్ అవుతున్న వార్తలు నిజమా? అబద్దమా? అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X