Virosh Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. ముహూర్తం ఎప్పుడంటే?

Vijay Deverakonda - Rashmika Mandanna Wedding: టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న (విరోష్) పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. వీరి వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ లగ్జరీ వేదిక ఐటీసీ మెమెంటోస్ ఉదయ్‌పూర్‌లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంతకీ వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే? అనేది ప్రస్తుతం చర్చనీయంగా మారింది.

తెలుగు సంప్రదాయంలో
పలు మీడియా నివేదిక ప్రకారం.. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు బరాత్ కార్యక్రమం ప్రారంభమైంది. సంప్రదాయ వాద్యాల నడుమ, రాజస్థానీ శైలిలో అలంకరించిన వేదికపై వరుడు విజయ్ దేవరకొండ ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఉదయం 10:10 గంటలకు తెలుగు హిందూ సంప్రదాయ ప్రకారం మొదటి వివాహ ముహూర్తం నిర్ణయించారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. అలాగే సప్తపది (ఏడు అడుగులు), తాళంబ్రాలు వంటి సంప్రదాయాలు నిర్వహించనున్నారు.

Vijay Deverakonda - Rashmika Mandanna Wedding Muhurat Time Revealed Virosh Grand Wedding in Udaipur

కొడవ సంప్రదాయంలో
సాయంత్రం 4:30 గంటలకు రష్మిక స్వంత కొడవ (కర్ణాటకలోని కొడగు ప్రాంతం) సంప్రదాయం ప్రకారం రెండో వివాహం నిర్వహించనున్నారు. ఈ సంప్రదాయం ప్రత్యేకత ఏమిటంటే.. పూజారి లేకుండా కుటుంబ పెద్దలే వివాహాన్ని నిర్వహిస్తారు. అగ్ని హోత్రం ఉండదు. పెళ్లి కూతురు తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొడవ సంప్రదాయంలో వధువు చేతిలో నాణేలు పట్టించటం ఒక ముఖ్యమైన ఆచారం. దీన్ని సంపద, స్థిరత్వం, కుటుంబ ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు.

ఈ వేడుకలో రష్మిక సంప్రదాయ కొడవ శారీ, ప్రత్యేక షాల్‌తో మెరిసిపోనుంది. విజయ్ కూడా కొడవ స్టైల్ దుస్తులు, తలపాగా ధరించి కనిపించనున్నారు. రెండు సంస్కృతులను ప్రతిబింబించేలా జంట ప్రత్యేకంగా సిద్ధమైంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ జరగనుంది.

ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్
గత మూడు రోజులుగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొంటోంది. మొదట అతిథుల కోసం ప్రత్యేక జపనీస్ డిన్నర్ ఏర్పాటు చేశారు. అనంతరం వాలీబాల్, క్రికెట్ మ్యాచ్‌లతో సరదాగా సమయం గడిపారు. తర్వాత మెగా సంగీత్ నైట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రష్మిక తన హిట్ ట్రాక్ 'అంగారోన్ కా అంబర్‌సార్' కు డ్యాన్స్ చేసి అందరినీ అలరించినట్లు సమాచారం. సంగీత్ అనంతరం హల్దీ కార్యక్రమం కూడా సంప్రదాయబద్ధంగా జరిగింది.

విజయ్ - రష్మిక ప్రేమ కథ
వీరిద్దరి ప్రయాణం 2018లో విడుదలైన గీతా గోవిందం (Geetha Govindam) సినిమా సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, వారి కెమిస్ట్రీకి విశేష స్పందన తెచ్చింది. తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ (Dear Comrade) సినిమాలో మరోసారి కలిసి నటించి, ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ సంపాదించారు. ఆన్‌స్క్రీన్‌లో వారి జోడీకి వచ్చిన ఆదరణ, ఆఫ్‌స్క్రీన్‌లోనూ చర్చనీయాంశమైంది.

డిన్నర్ ఔటింగ్స్, వెకేషన్స్, ఇండస్ట్రీ ఈవెంట్స్‌లో తరచూ కలిసి కనిపించినా, ఇద్దరూ తమ రిలేషన్‌పై ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. ఇంటర్వ్యూల్లో ఒకరినొకరు "క్లోజ్ ఫ్రెండ్" అని మాత్రమే పేర్కొన్నారు. కానీ అభిమానులు మాత్రం వారి మధ్య ఉన్న బంధాన్ని ఎప్పుడో గుర్తించారు. ఇప్పుడు, ఆ రూమర్లన్నింటికీ తెరదించుతూ విజయ్- రష్మిక నిజ జీవితంలోనూ జీవిత భాగస్వాములుగా మారుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X