Virosh Reception: మా రిసెప్షన్ కు రావద్దు.. విజయ్-రష్మిక కీలక నిర్ణయం..
Vijay Deverakonda - Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు వివాహ బంధం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం తెలుగు, కొడవ సాంప్రదాయాల్లో ఒకేరోజున రెండుసార్లు జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ వేడుక దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఇప్పుడు ఈ జంట రిసెప్షన్‌పై దృష్టి సారించింది. మార్చి 4నహైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, జాతీయ స్థాయి అతిథులు హాజరవుతారని సమాచారం. దీంతో ఈ ఈవెంట్ హై ప్రొఫైల్ కార్యక్రమంగా మారింది.అయితే ఈ సమయంలో ఈ సెలబ్రెటీ జంట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయమేంటీ?

ఈ గ్రాండ్ రిసెప్షన్ పూర్తిగా ఇన్విటేషన్ ఆధారిత కార్యక్రమం. ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం. ఆహ్వానం లేనివారు రావొద్దని స్పష్టంగా తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడే అవకాశముందని అంచనా. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పోలీసులతో చర్చించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు. హోటల్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది. ప్రత్యేక చెకింగ్ ఉంటుంది. గేట్ల వద్ద ఆహ్వాన పత్రాల పరిశీలన ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించరు. ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భద్రత అనే తెలుస్తోంది. ప్రముఖులు హాజరవుతున్నందున సెక్యూరిటీ అత్యంత ముఖ్యమైంది. కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు వస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అనుకోని ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టే ముందు జాగ్రత్తగా వీరి తమ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఈ జంట అభిమానులకు ప్రత్యేక ప్రకటన చేశారు.
ఈ ప్రకటనలో 'మీ ప్రేమ మాకు ఎంతో విలువైనది. అయితే మీ భద్రత మాకు మరింత ముఖ్యము. ఆహ్వానం లేని వారు రిసెప్షన్ వేదిక వద్దకు రాకండి. వచ్చి ఇబ్బందులు పడొద్దు' అని జంట విజ్ఞప్తి చేసింది. అభిమానుల ఆశీస్సులు ఎక్కడ ఉన్నా తమకు అందుతాయని, అందరి క్షేమమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అలాగే.. 'విరోష్' జంట అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. 'మీ ప్రేమే మా బలం. మీరు ఎక్కడ ఉన్నా మీ దీవెనలు మాతోనే ఉంటాయి. రిసెప్షన్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు మీ సహకారం అవసరం' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











