అలాంటి సీన్ అందరి ముందంటే కష్టం.. హీరోయిన్ కంఫర్ట్‌గా లేదంటే.. విజయ్ దేవరకొండ

Recommended Video

Vijay Deverakonda Reacts On Lip lock Scenes With Rashmika || Filmibeat Telugu

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ముద్దు సీన్లే. గీత గోవిందం సినిమాలో ఇద్దరూ చేసిన హంగామా. రొమాంటిక్ సీన్స్ వీరిని క్రేజీ జంటగా మార్చేశాయి. అయితే అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ చేస్తూ 'డియర్ కామ్రేడ్' సినిమా వస్తుండటం, ఈ సినిమాలో కూడా ఇద్దరి లిప్ లాక్ సీన్స్ ఉండటంతో జనంలో క్రేజ్ పెరిగింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా 'డియర్ కామ్రేడ్' ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన విజయ్ దేవరకొండ కిస్ సీన్స్ పై మరోసారి ఆసక్తికరంగా స్పందించాడు.

ఫోకస్ అంతా డియర్ కామ్రేడ్ లిప్‌లాక్స్ పైనే

ఫోకస్ అంతా డియర్ కామ్రేడ్ లిప్‌లాక్స్ పైనే


ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' సినిమా టీజర్ లోనే రష్మిక, విజయ్ దేవరకొండ లిప్‌లాక్స్ చూపించి సినిమాపై హైప్ తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. వర్షంలో తడుస్తూ రష్మిక పెదాలపై విజయ్ దేవరకొండ పెట్టిన ముద్దు వైరల్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక ఎక్కడికెళ్లినా వాళ్ళిద్దరి లిప్‌లాక్స్ గురించే అడుగుతున్నాయి మీడియా వర్గాలు.

చర్చలు బాగా ముదరడంతో

చర్చలు బాగా ముదరడంతో

లిప్‌లాక్స్ విషయమై ఇప్పటికే విజయ్, రష్మిక చాలాసార్లు స్పందించారు కూడా. లిల్లి, బాబీ క్యారెక్టర్స్‌లో లీనమై కిస్సులు పెట్టుకున్నాం తప్ప.. విజయ్, రష్మికలు కిస్ చేసుకుంటున్నట్లుగా అస్సలు ఉహించుకోలేదని చెప్పారు. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలు నివృత్తి కావడం లేదు. ముద్దు సన్నివేశాలపై చర్చలు ముదిరాయి. దీంతో తాజాగా మరోసారి దీనిపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు.

 అందరి ముందు ముద్దంటే కాస్త ఇబ్బందే.. కానీ

అందరి ముందు ముద్దంటే కాస్త ఇబ్బందే.. కానీ

చిత్రీకరణ సమయంలో అందరిముందు ముద్దు పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇలాంటి సీన్లు చేసేప్పుడు హీరోతో పాటు హీరోయిన్‌ కూడా కంఫర్ట్‌గా ఫీల్ కావాలి. మేం ఇబ్బందిపడినా ఫర్వాలేదు కానీ.. సినిమా చూసే ప్రేక్షకులకు మాత్రం మేం ఇబ్బంది పడినట్లు తెలియకూడదు అని విజయ్ దేవరకొండ అన్నాడు. ఇక తన తర్వాతి సినిమాలో లిప్ లాక్స్ లేవులే అంటూ చివగా నవ్వు తెప్పించారు విజయ్.

 ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

జులై 26 వ తేదీన విడుదలకు సిద్దమైన డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (బుధవారం) వైజాగ్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేదికపై కూడా రష్మిక గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు విజయ్. ఆమె తనతో సినిమా చేయడం కోసం ఎన్నో మాటలు పడిందని, ఈ సినిమా గురించి పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయినా చేసిందని.. లిల్లీ అనే క్యారెక్టర్ లీనమైందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

డియర్ కామ్రేడ్ మూవీ

డియర్ కామ్రేడ్ మూవీ

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కింది 'డియర్ కామ్రేడ్' మూవీ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జులై 26న భారీ అంచనాల నడుమ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది డియర్ కామ్రేడ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X