ఒకరి తర్వాత మరొకరు.. మరో లవర్‌తో ఫ్రాన్స్ వీదుల్లో విజయ్ దేవరకొండ
ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా అందరినీ వరుసగా పరిచయం చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' కోసం డిఫెరెంట్ ప్రమోషన్ మొదలుపెట్టిన ఆయన.. ఇప్పటికీ ఓ లవర్‌ని పరిచయం చేసి ఇప్పుడు మరో లవర్‌ని మనముందుంచాడు.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తన నలుగురు లవర్స్‌ని పరిచయం చేయబోతున్నా అని ముందుగానే చెప్పిన విజయ్ దేవరకొండ.. ఈ మేరకు మొన్న ఐశ్వర్య రాజేష్‌ని, నిన్న ఇజబెల్లాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇలా నాలుగు రోజుల్లో వరుసగా నలుగురు లవర్స్‌ని అందరి ముందుకు తీసుకురానున్నాడు విజయ్ దేవరకొండ.

చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్.. సువర్ణ అనే గృహిణి పాత్రలో నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ అయిన ఇజబెల్లా.. ఇజ పాత్రలో నటిస్తోంది. ఈమెతో కలిసి విజయ్ ఫ్రాన్స్ వీదుల్లో విహరిస్తున్న పోస్టర్‌ను విడుదల చేశాడు. దీనితో పాటు విజయ్ అభిమానులకు మరో తీపి కబురు చెప్పింది చిత్ర యూనిట్. జనవరి 3న చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న అన్ని లుక్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











