twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ 'డియర్ కామ్రేడ్'.. హీరో విషయమై విజయ్ దేవరకొండ కామెంట్

    |

    అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో సంచలన విజయాలు సొంతం చేసుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరికొద్ది రోజుల్లో డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఇటీవలే 'డియర్ కామ్రేడ్' చూసిన బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీ రీమేక్ చేసేందుకు గాను మైత్రి నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

    ఇప్పటికే డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెలుగు సహా ఇతర సౌత్ ఇండియన్ భాషలు తమిళ, మళయాళ, కన్నడ లలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీ రీమేక్ అనే వార్త జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఈ రీమేక్‌లో నటించనున్న హీరో ఎవరనే విషయం తెలపక పోవడంతో దానిపై దృష్టి కేటాయించాయి మీడియా వర్గాలు. ఈ మేరకు డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ లో మీరే హీరోగా నటిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన విజయ్.. తాను నో చెప్పానని అన్నాడు. ఒకే సినిమాలో రెండు సార్లు నటించడం తనకు ఆసక్తి అనిపించిందని ఈ సందర్బంగా ఆయన చెప్పాడు. కాకపోతే తాను ఇతర బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనని ఆయన చెప్పుకొచ్చాడు.

    Vijay Deverakonda Responds On Dear Comrade Hindi Remake Hero

    ఇక డియర్ కామ్రేడ్ సినిమా విషయానికొస్తే.. విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్‌ కామ్రేడ్' సినిమా జూలై 26న విడుదల అకానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Tollywood star hero Vijay Deverakonda has managed command a huge fan following among youth with just a few films. Success of Arjun Reddy and Geetha Govindam, he is regarded as an icon among youngsters in South India level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X