Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
హిందీ 'డియర్ కామ్రేడ్'.. హీరో విషయమై విజయ్ దేవరకొండ కామెంట్
అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో సంచలన విజయాలు సొంతం చేసుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరికొద్ది రోజుల్లో డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఇటీవలే 'డియర్ కామ్రేడ్' చూసిన బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీ రీమేక్ చేసేందుకు గాను మైత్రి నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇప్పటికే డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెలుగు సహా ఇతర సౌత్ ఇండియన్ భాషలు తమిళ, మళయాళ, కన్నడ లలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీ రీమేక్ అనే వార్త జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఈ రీమేక్‌లో నటించనున్న హీరో ఎవరనే విషయం తెలపక పోవడంతో దానిపై దృష్టి కేటాయించాయి మీడియా వర్గాలు. ఈ మేరకు డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ లో మీరే హీరోగా నటిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన విజయ్.. తాను నో చెప్పానని అన్నాడు. ఒకే సినిమాలో రెండు సార్లు నటించడం తనకు ఆసక్తి అనిపించిందని ఈ సందర్బంగా ఆయన చెప్పాడు. కాకపోతే తాను ఇతర బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనని ఆయన చెప్పుకొచ్చాడు.
ఇక డియర్ కామ్రేడ్ సినిమా విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' సినిమా జూలై 26న విడుదల అకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు ఈ సినిమా విడుదల కానుంది.