కోహ్లీతో డేటింగ్.. విజయ్ దేవరకొండతో రొమాన్స్.. యంగ్ హీరోయిన్ భలే స్పీడుగా ఉందే!
టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసి ఆ మధ్య హాట్ హాట్ వార్తల్లో నిలిచిన ఓ హీరోయిన్ ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ గాళ్ ఫ్రెండ్ అవతారమెత్తడం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర అంశంగా మారింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండతో కలిసి ఫ్రాన్స్ లో తెగ ఎంజాయ్ చేస్తోందట. ఈ ఇష్యుపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? విజయ్ దేవరకొండతో రొమాన్స్ ఎందుకు చేస్తోంది? ఆ వివరాలు చూస్తే..

బ్రెజిల్ నుంచి ఇండియాకు అందాల సుందరి
బ్రెజిల్ టాప్ మోడల్ గా అందాల విందు చేసిన ఇజబెల్లా లియాట్.. మెల్లగా ఇండియా చేరుకొని బాలీవుడ్ మూవీ సిక్ట్సీన్స్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ బ్రెజిల్ భామ ఇప్పుడు సౌత్ హీరో విజయ్ దేవరకొండ గాళ్ ఫ్రెండ్ గా ఫ్రాన్స్ లోని అందమైన లొకేషన్స్‌లో రొమాన్స్ చేస్తుండటం విశేషం.

విరాట్ కోహ్లీతో రెండేళ్ల పాటు.. ఆ తర్వాత మరో స్టార్‌తో కూడా
ఇజబెల్లా లియాట్ సినిమాల్లో నటిస్తూనే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా తోనూ ఈ అమ్మడు ఎఫైర్ సాగించిందని బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ప్రచారాలు సాగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సౌత్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఆమె చెట్టాపట్టాలేయడం ఆసక్తికరంగా మారింది.

రౌడీ స్టార్‌తో భలే ఛాన్సులే..
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజ్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. దీంతో ఈయనతో నటిస్తున్న హీరోయిన్లు కూడా ఫుల్లుగా ఫోకస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ భామ ఇజబెల్లా లియాట్‌కి రౌడీ స్టార్‌తో రొమాన్స్ చేసే అవకాశం మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విజయ్ దేవరకొండ గాళ్ ఫ్రెండ్‌గా తెగ రొమాన్స్ చేస్తూ కనిపించనుంది ఇజబెల్లా.

ముగ్గురు హీరోయిన్స్‌లో ఈమె తోనే ఎక్కువ రొమాన్స్
కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఎన్నికవడం విశేషం. అయితే ఈ ముగ్గురిలో విజయ్ దేవరకొండ గాళ్ ఫ్రెండ్‌గా చేయబోతున్న ఇజబెల్లా తోనే విజయ్ రొమాన్స్ బాగా పండించనున్నాడని సమాచారం. ఈ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్‌లో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ మిగతా ఇద్దరు హీరోయిన్లు.

ఫ్రాన్స్‌లో షూటింగ్
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రాన్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే మురారి తరహా పాత్ర పోషిస్తున్నాడట విజయ్ దేవరకొండ. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఇతర వివరాలు ప్రకటించనున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











