విజయ్ దేవరకొండ జోష్.. నెల ముందుగానే మొదలు పెట్టేశారు
టాలీవుడ్‌లో అనతికాలం లోనే స్టార్ హీరో స్థాయి క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు పోషించి ఇటు ప్రేక్షకులను, అటు దర్శకనిర్మాతలు ఆకట్టుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. విజయ్ దేవరకొండ సినిమా అంటేనే.. అస్సలు మిస్ కాకూడదు అనే స్టేజ్‌కి వెళ్లిపోయారు ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తాజా సినిమా డియర్ కామ్రేడ్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై 26న ఈ సినిమా విడుదలను కన్ఫర్మ్ చేయడంతో మొదటి రోజే ఈ సినిమా చూసేయాలనే కుతూహలంతో ఉన్నారు ప్రేక్షకులు. దీంతో డియర్ కామ్రేడ్ పై భారీ క్రేజ్ నెలకొంది. అయితే ఈ క్రేజ్ క్యాష్ చేసుకోడానికి అప్పుడే పావులు కదుపుతున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు. ఒక్కరోజు రెండూ రోజులు కాకుండా రొటీన్ కి భిన్నంగా ఏకంగా నెల రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసేశారు.

తెలుగు సినిమాలకు ఎక్కువగా ఆదరణ లభించే అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయని తెలుస్తోంది. టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని అంటున్నారు. నెల ముందుగానే ఇంత డిమాండ్ ఉందంటే.. విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంతలా పెరిగిందో అర్థంచేసుకోవచ్చు. డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ సూపర్ హిట్ జోడీ రష్మిక మందన్న నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నింపింది.
ఇప్పటికే విడుదలైన డియర్ కామ్రేడ్ పాటలు, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మొదటిసారి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. జులై 26 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











