తమిళ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీస్ తో హీరోగా

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాల వేగం పెంచాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరో పక్క క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్, క్రాంతి కుమార్ బ్యానర్ పై ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

ఇలా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా మరో తెలుగు, తమిళ భాషల్లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. మే 19, ఆదివారం రోజున మైత్రీ మూవీస్ బ్యానర్ పై హీరో అనే సినిమా ప్రారంభమైంది. నిరాడంబరంగా సాగిన ముహుర్తపు కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత రవిశంకర్, దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరయ్యారు.

Vijay Deverakondas Hero Movie started

ముహుర్తపు షాట్ కు కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రానికి ఆనంద అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర మే 22 తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మైత్రీ మూవీస్ బ్యానర్ కు ఇది తొమ్మిదో సినిమా. మాళవిక మోహనన్ విషయానికి వస్తే.. ఆమె పేట్టా సినిమా ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు.

Vijay Deverakondas Hero Movie started

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జూలై 26న రిలీజ్ కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటించింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మూవీ ప్రస్తుతం నిర్విరామంగా షూట్ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X