మీకు మాత్రమే చెప్తా సెన్సార్ క్లియర్.. బోర్డు సభ్యుల రిపోర్ట్ ఏంటంటే!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాణంలో రాబోతున్న కొత్త సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన విజయ్ దేవరకొండ తన తొలి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండటం విశేషం. నవంబర్ 1న విడుదలకు సిద్దమైన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.
'మీకు మాత్రమే చెప్తా' సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించారని తెలుస్తోంది. సరికొత్త అంశాలకు తెర రూపమిస్తూ 'మీకు మాత్రమే చెప్తా' సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయని అన్నారట.

షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మించాడు. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తుండటం విశేషం. న్యూ ఏజ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించింది.
ఇంకా ఈ చిత్రంలో అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శివకుమార్ సంగీతం అందించారు. మదన్ గుణదేవా సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన 'మీకు మాత్రమే చెప్తా' టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











