వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ.. వావ్! యమ క్రేజీ టైటిల్ ఫిక్స్
ఇటీవలే 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన విజయ్ దేవరకొండ ఈ సారి మరింత స్ట్రాంగ్‌గా దిగాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించి సినిమాపై ఓ రేంజ్ ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్.

వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ
గత కొంతకాలంగా ఈ సినిమాకు 'లవర్' అనే టైటిల్ ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికి దగ్గరగానే, కాస్త డిఫెరెంట్‌గా ఉండేలా ఫిక్స్ చేసి
'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ మేరకు టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. గతంలో ఎన్నడూ చూడనంత డిఫెరెంట్‌గా ఈ టైటిల్ పోస్టర్ డిజైన్ చేయడం విశేషం.

ఫస్ట్‌లుక్ పోస్టర్ ఎప్పుడంటే..
'వరల్డ్ ఫేమస్ లవర్' అంటూ టైటిల్ ప్రకటించిన చిత్రయూనిట్.. అదే పోస్టర్ పై ఫస్ట్‌లుక్ పోస్టర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయాన్ని కూడా రివీల్ చేసింది. సెప్టెంబర్ 20 వ తేదీ శుక్రవారం రోజున ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నామని పేర్కొని మరింత ఆసక్తి రేపారు.

విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశిఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా కూడా మరో ముగ్గురు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ డిఫెరెంట్‌గా ఉంటుందని, ఆయన ఓ రైటర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

అందుకే ఈ టైటిల్ పెట్టారా..?
ఇంతమంది హీరోయిన్ల చుట్టూ తిరగే కథ కాబట్టే దీనికి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ కంఫర్మ్ చేశారని తెలుస్తోంది. నలుగురు హీరోయిన్ల నడుమ నడిచే ఈ కథలో విజయ్ దేవరకొండ రోల్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ విశేషాలు
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











