చెత్త రాజకీయాలు.. అయినా తప్పడం లేదు.. విజయ్ దేవరకొండ
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్లతో విజయ్ దేవరకొండ దూసుకెళ్తున్నారు. గీతా గోవిందం తర్వాత ఆయన రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో నోటా ఒకటి. ఈ చిత్రం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్తను విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.
నాకు రాజకీయాలంటే అసలే పడవు. కానీ అలాంటి చిత్రాల్లో నటించడం తప్పడం లేదు. నోటా సినిమా పూర్తయింది. 48 గంటల్లో టీజర్, 72 గంటల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అని ట్వీటర్ చేశారు.
ఇరుమురుగన్ ఫేం ఆనంద శంకర్ దర్శకత్వంలో నోటా చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 6న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న నోటా చిత్రానికి విజయ్ దేవరకొండ తమిళంలో కూడా డబ్బింగ్ చెప్పనున్నారు. నా గొంతులోనే తమిళ డైలాగ్‌లు ఉంటాయని విజయ్ దేవరకొండ ఇటీవల ట్వీట్ కూడా చేశారు.


Click it and Unblock the Notifications











