Vijay Devarakonda: ఆఫీస్‌కి పిలిచి అలాంటి అవమానం.. విజయ్‌ కష్టాలపై ఆనంద్ దేవరకొండ ఎమోషనల్

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వివాహం కోసం విజయ్, రష్మికలతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఇప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న విజయ్ - రష్మికలు మరికొద్దిగంటల్లో భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్ - రష్మికల పెళ్లి ఏర్పాట్లు, అతిథులు, వారి కెరీర్ గురించే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ స్థాయికి చేరుకోవడం వెనుకపడిన కష్టాలకు సంబంధించి తన సోదరుడు ఆనంద్ దేవరకొండ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

9 మే 1989న హైదరాబాద్‌లో జన్మించారు విజయ్ దేవరకొండ. ఆయన పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. అతని తండ్రి గోవర్ధన్ రావు సీరియల్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అయితే తను సీరియల్స్ సరైన విజయాలు సాధించకపోవడంతో పరిశ్రమ నుంచి తప్పుకున్నారు. పుట్టపర్తిలోని శ్రీసత్య సాయి స్కూల్‌లో చదువుకున్న విజయ్ ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. నువ్విలా చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు సినిమాలతో బ్రేక్ అందుకున్నాడు. ఈ దశలో అర్జున్ రెడ్డి మూవీ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.

Vijay Deverakonda s Struggles Before Stardom Anand Deverakonda Shares his brother Emotional Journey

ఆ తర్వాత మహానటి, గీతా గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ మూవీలతో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. ప్రస్తుతం రౌడీ జనార్థన, రణబాలి సినిమాలలో విజయ్ నటిస్తున్నారు. అయితే ఇదంతా ఆయనకు అంత తేలికగా దొరకలేదు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలతో పాటు ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వాటికి తట్టుకుని నిలబడ్డారు. కొద్దిరోజుల క్రితం విజయ్ సోదరుడు , హీరో ఆనంద్ దేవరకొండ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. అన్నయ్య మా కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడ్డారని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

నా జీవితంలో చాలా ఎమోషనల్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. అన్నకి నేను సపోర్ట్ చేశానని అంతా అంటున్నారు కానీ.. దానికంటే ముందే అన్నయ్య కష్టపడ్డాడు. నేను ఇంజనీరింగ్ చేసే సమయంలో ఇంట్లో చాలా టైట్ ఉంది.. మనకి మనీ టైట్ ఉన్నప్పుడు ప్రతిది ఇబ్బందిగానే ఉంటుంది. ఆ మెంటల్ టార్చర్ కూడా తట్టుకోలేం. అప్పుడు విజయ్ గట్టిగా అనుకుని, పట్టుదలతోటి ప్రతి ఆడిషన్‌కి ట్రై చేస్తున్నాడు. చాలామంది ప్రొడ్యూసర్స్ నువ్వు హీరోగా ఫిట్ కావు అంటూ ముఖం మీదే అనేవాళ్లు. తర్వాత ఓ డైరెక్టర్.. అన్నకి ఆఫర్ ఉందని విజయ్‌తో పాటు ముగ్గురిని పిలిచి కెమెరాలు పెట్టేసి లైవ్‌లో ఓ సీన్ మొత్తం షూట్ చేశాడు. ముగ్గురిలో ఒకరిని సెలెక్ట్ చేస్తానని చెప్పాడని ఆనంద్ దేవరకొండ తెలిపారు.

నేను కూడా అన్నతో పాటే అక్కడికి వెళ్లి ఈ ప్రాసెస్ మొత్తం చూశా. నిజానికి ఆ ముగ్గురిలో మా అన్న ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆఫీస్‌లో పనిచేసి ఇంటికొచ్చేశాం.. వారం రోజుల్లో మన లైఫ్ సెట్ అయిపోతుందని అనుకున్నాం. కోరికలు ఉంటాయి కదా. అయితే రోజులు గడుస్తున్నా ఆ డైరెక్టర్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఓ రోజున న్యూస్ పేపర్ చూస్తుంటే ఆ సినిమాకు ఈ యాక్టర్ సెలెక్ట్ అయ్యాడని వచ్చింది. ఆ న్యూస్ చదివిన నాకు ఏడుపు ఆగలేదు.. అన్నకి చెబితే లైట్ అన్నాడు. అప్పటికే ఇలాంటివి జరిగి ఉండటంతో అన్న అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఆ డైరెక్టరే పిలిచి మరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆఫర్ ఇచ్చాడు అని ఆనంద్ గుర్తుచేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X