'వరల్డ్ ఫేమస్ లవర్' మై లవ్ సాంగ్.. రొమాంటిక్ సీన్స్ అదుర్స్
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా మరోసారి యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ నటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి ఆకట్టుకుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ''మై లవ్... మనసును మీటే'' రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ముగ్గురు హీరోయిన్లతో విజయ్ నటించిన సన్నివేశాలు చూపించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ రొమాన్స్ అదుర్స్ అనేట్లుగా ఉంది. ఈ పాటకు రహ్మాన్ సాహిత్యం సమకూర్చారు. శ్రీకృష్ణ, రమ్య బెహరా ఎంతో అందంగా, వినసొంపుగా పాడారు. గోపిసుందర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయింది. దీంతో ఈ మెలొడీ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ పాటను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలోని తొలిపాట ఓ అందమైన భావన అని పేర్కొన్నారు. ఈ పాట తనను అన్ని మధుర క్షణాల గురించి ఆలోచించేలా చేసిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











