వరల్డ్ ఫేమస్ లవర్: ''బొగ్గు గనిలో'' హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా మరోసారి యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నాడు విజయ్. చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.
ఇందులో భాగంగా ఇప్పటికే పలు పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన యూనిట్ సభ్యులు.. తాజాగా రెండో పాట రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ''బొగ్గు గనిలో'' అంటూ ఈ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్.. ఈ పాటను రేపు (జనవరి 29) సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్‌లో హీరో విజయ్ పక్కనే గ్లామరస్ లుక్‌లో హీరోయిన్ కేథరిన్ కనిపిస్తోంది.

పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ పాటను బొగ్గుగనిలో విజయ్ దేవరకొండ - కేథరిన్‌లపై షూట్ చేసినట్లు తెలుస్తోంది. గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications