Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏడ్చుకుంటూ వచ్చి నా వైపు వేలు చూపించాడు.. భయమేసింది: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంత యాక్టీవ్‌గా ఉంటారో చెప్పక్కర్లేదు. సినిమాల్లో గానీ, ఆడియో వేదికల్లో గానీ అతని మాటలే అందరిలో జోష్ నింపుతాయి. తెలంగాణ యాసలో విజయ్ మాట్లాడే తీరు బాగా అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా 'దొరసాని' ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విజయ్ దేవరకొండ తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. తమ చిన్నతనంలో జరిగిన కొన్ని విషయాలను గూర్చి తెలుపుతూ తనదైన స్టైల్లో ఆడియన్స్‌లో జోష్ నింపారు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితరాజశేఖర్ కూతురు శివాత్మిక జంటగా నటిస్తున్న సినిమా 'దొరసాని'. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అటు ఆంధ్ దేవరకొండకు, ఇటు శివాత్మికకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని 'దొరసాని' పై అంచనాలు పెంచేశాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (ఆదివారం) ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది చిత్రయూనిట్.
ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన విజయ్ దేవరకొండ తమ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ''నేను చిన్నప్పుడు పుట్టపర్తి హాస్టల్లో చదివాను. అయితే నేను నాలుగో తరగతిలో ఉన్నపుడు మా తమ్ముడు ఆనంద్ ఒకటో తరగతిలో జాయిన్ అయ్యాడు. మా క్లాసులు వాడికంటే వారం ముందుగానే స్టార్ట్ అయ్యాయి. ఓ రోజు క్లాస్‌లో నేను సీరియస్‌గా క్లాస్ వింటుండగా.. సడెన్‌గా ఆనంద్ ఏడ్చుకుంటూ వచ్చి మా క్లాస్ డోర్ దగ్గర నిల్చున్నాడు. వాడి వెనకాలే టీచర్ పరుగెత్తుకుంటూ వచ్చి వాడిని క్లాస్‌కి తీసుకెళుతుంటే.. నావైపు నా వైపు వేలు చూపించాడు.. భయమేసింది. ఆ టైమ్‌లో వాడు ఏడుస్తుంటే నా గుండె పగిలి పోయింది. ఆ తర్వాత ఆ టీచర్ వాడిని మా క్లాస్ లోనే మూడు రోజులు కుర్చోనిచ్చింది. నా దోస్తులంతా వాడి దోస్తులై పోయారు. అప్పటి నుంచి నేనెక్కడికి వెళితే అక్కడికి రావడం వాడికి అలవాటై పోయింది'' అని విజయ్ దేవరకొండ చెప్పాడు.