twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడ్చుకుంటూ వచ్చి నా వైపు వేలు చూపించాడు.. భయమేసింది: విజయ్ దేవరకొండ

    |

    టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంత యాక్టీవ్‌గా ఉంటారో చెప్పక్కర్లేదు. సినిమాల్లో గానీ, ఆడియో వేదికల్లో గానీ అతని మాటలే అందరిలో జోష్ నింపుతాయి. తెలంగాణ యాసలో విజయ్ మాట్లాడే తీరు బాగా అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా 'దొరసాని' ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విజయ్ దేవరకొండ తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. తమ చిన్నతనంలో జరిగిన కొన్ని విషయాలను గూర్చి తెలుపుతూ తనదైన స్టైల్‌లో ఆడియన్స్‌లో జోష్ నింపారు విజయ్ దేవరకొండ.

    విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితరాజశేఖర్ కూతురు శివాత్మిక జంటగా నటిస్తున్న సినిమా 'దొరసాని'. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అటు ఆంధ్ దేవరకొండకు, ఇటు శివాత్మికకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని 'దొరసాని' పై అంచనాలు పెంచేశాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (ఆదివారం) ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది చిత్రయూనిట్.

    Vijay Deverakonda says a Intresting Movement of Anandh Deverakonda

    ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన విజయ్ దేవరకొండ తమ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ''నేను చిన్నప్పుడు పుట్టపర్తి హాస్టల్‌లో చదివాను. అయితే నేను నాలుగో తరగతిలో ఉన్నపుడు మా తమ్ముడు ఆనంద్ ఒకటో తరగతిలో జాయిన్ అయ్యాడు. మా క్లాసులు వాడికంటే వారం ముందుగానే స్టార్ట్ అయ్యాయి. ఓ రోజు క్లాస్‌లో నేను సీరియస్‌గా క్లాస్ వింటుండగా.. సడెన్‌గా ఆనంద్ ఏడ్చుకుంటూ వచ్చి మా క్లాస్ డోర్ దగ్గర నిల్చున్నాడు. వాడి వెనకాలే టీచర్ పరుగెత్తుకుంటూ వచ్చి వాడిని క్లాస్‌కి తీసుకెళుతుంటే.. నావైపు నా వైపు వేలు చూపించాడు.. భయమేసింది. ఆ టైమ్‌లో వాడు ఏడుస్తుంటే నా గుండె పగిలి పోయింది. ఆ తర్వాత ఆ టీచర్ వాడిని మా క్లాస్ లోనే మూడు రోజులు కుర్చోనిచ్చింది. నా దోస్తులంతా వాడి దోస్తులై పోయారు. అప్పటి నుంచి నేనెక్కడికి వెళితే అక్కడికి రావడం వాడికి అలవాటై పోయింది'' అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

    English summary
    Hero Rajashekar daughter Shivathmika and Vijay Devarakonda brother Anandh Deverakonda debut movie is Dorasani. In this movie Shivathmika performed as Dorasani. On sunday this movie pre release event is successfully completed in Warangal. On this stage Vijay Devarakonda says about his brother Anandh deverakonda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X