నాకు నలుగురు లవర్స్.. ఆ ఫోటోలు మీ ముందుంచుతా.. విజయ్ దేవరకొండ ఓపెన్ స్టేట్‌మెంట్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు నలుగురు లవర్స్ ఉన్నారట. బహుశా ఇందుకేనేమో 'వరల్డ్ ఫేమస్ లవర్' అయ్యాడు. ఈ నలుగురినీ వరుసగా పరిచయం చేస్తాను. అది కూడా నాలుగు రోజుల్లో అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇంతకీ ఆ నలుగురు లవర్స్ ఎవరు? ఈయన ఓపెన్ స్టేట్‌మెంట్ వెనుక అర్థమేంటి? ఓ లుక్కేద్దామా..

విజయ్ దేవరకొండ 'వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌'

విజయ్ దేవరకొండ 'వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌'

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ‘వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌'. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన లుక్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి.

నలుగురు అందాల భామలతో రొమాన్స్

నలుగురు అందాల భామలతో రొమాన్స్

చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు అందాల భామలు నటిస్తున్నారు. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా ఈ నలుగురూ మన క్రేజీ స్టార్‌తో రొమాన్స్ చేస్తున్నారు. వీళ్లందరితో మనోడు చేసే రొమాన్స్ ఈ సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో కావడం పైగా నలుగురు అందాల భామలతో రొమాన్స్ అనేసరికి ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

నాలుగు రోజుల్లో వరుసగా నలుగురు లవర్స్

నాలుగు రోజుల్లో వరుసగా నలుగురు లవర్స్

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తన నలుగురు లవర్స్‌ని పరిచయం చేయబోతున్నాడట విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నాలుగు రోజుల్లో వరుసగా నలుగురు లవర్స్ పోస్టర్స్ మీ ముందుంచుతానని ఆయన తెలిపాడు. సరికొత్తగా ఇలా విజయ్ చేస్తున్న ప్రమోషన్ చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు.

తేదీలు వేరైనా ముహూర్తం ఒకటే

ఈ మేరకు డిసెంబ‌ర్ 12న ఐశ్వర్యా రాజేష్‌, డిసెంబ‌ర్ 13న ఇజా బెల్లా, డిసెంబ‌ర్ 14న క్యాథరిన్ త్రెసా, డిసెంబ‌ర్ 15న రాశీఖ‌న్నాల‌ పోస్టర్స్ విడుదల చేయనున్నామని తెలిపాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ నలుగురికీ తేదీలు వేరైనా ముహూర్తం మాత్రం ఓకే సమయానికి పెట్టడం విశేషం. ఆ నాలుగు రోజులు సాయంత్రం 6:03 కు ఈ పోస్టర్స్ రిలీజ్ చేయనున్నారు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి..

కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి..

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ కథా రచయితగా కనిపిస్తాడని టాక్. ఆ హీరో రాసే కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి వచ్చే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల కానుందని అంటునప్పటికీ దాన్ని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారనేది తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X