కాంట్రవర్సీలో కొత్త రికార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరో
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా ఇండస్ట్రీలో హాట్ టాపిగ్ మారుతోంది. విజయ్ ఒక్కడు మాట్లాడితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అతని మాటలకు స్పందిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు లాల్ డౌన్ లో తను చేయాల్సిన మంచి పనులు చేస్తూనే.. మరో వైపు మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఫేక్ న్యూస్..
ఇటీవల విజయ్ తనపై వచ్చిన కొన్ని ఫేక్ న్యూస్ లపై చాలా సీరియస్ అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తం ఈ వార్తలపై స్పందించాల్సి ఉందంటూ పిలుపునివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ప్రతి ఒక్కరు విజయ్ చెప్పిన మాటలకు మద్దతు ఇచ్చారు. నాగార్జున కూడా ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని కోరడం హాట్ టాపిక్ గా మారింది.

ఫ్యాన్స్ కూడా..
విజయ్ దేవరకొండను ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మెయిన్ గా ఇటీవల విజయ్ చేసిన కామెంట్స్ కి ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా స్పందించారు. సినిమా ఇండస్ట్రీపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై ఇన్నాళ్లకు ఒక హీరో కరెక్ట్ గా సమాధానం చెప్పాడని అభిమానుల నుంచి విజయ్ కి మద్దతు లభిస్తోంది.

కాంట్రవర్సీలో మరో రికార్డు..
ఈ కాంట్రవర్సీ వైరల్ అవుతుండగానే విజయ్ దేవరకొండ మరో రికార్డు అందుకున్నాడు. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ రికార్డు సృష్టించాడు. విజయ్ ఫాలోవర్స్ సంఖ్య ఇప్పటికే 7 మిలియన్స్ దాటింది. రెండేళ్లలోనే విజయ్ తన క్రేజ్ ని మిగతా హీరోల కంటే మరింతగా పెంచుకున్నాడని చెప్పవచ్చు.
Recommended Video

మిడిల్ క్లాస్ ఫండ్..
విజయ్ దేవరకొండ ఇటీవల మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా పేదలకు సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నాడు. వీలైనంత వరకు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఆదుకునే ప్రయత్నం చేయనున్నట్లు విజయ్ ఇటీవల వివరణ ఇచ్చాడు. ఇక ఎప్పటికప్పుడు ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న మేలు గురించి కూడా విజయ్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











