కింగ్డమ్.. చాలా పెద్దొన్నైపోతా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 4 రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. తాజాగా ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తాజా ప్రసంగం ఆసక్తికరంగా మారింది. కింగ్డమ్ కు రాబోయే రిజల్ట్ పై విజయ్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కెరీర్ ఫస్ట్ టైమ్ ఇలా..
విజయ్ దేవరకొండ కెరీర్ లో తొలిసారిగా స్పై యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. కింగ్డమ్ చిత్రంతో సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇప్పటి వరకు రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాలో నటించిన విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ కాస్తా రూటు మార్చి స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో అలరించేందుకు సిద్ధమయ్యారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత న్యూ అవతార్ తో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కింగ్డమ్ చిత్రంపైనే దేవరకొండ ఆశలన్నీ పెట్టుకున్నారు.

Vijay Deverakonda Shocking Comments about Kingdom Movie Result

విజయ్ దేవరకొండ స్పీచ్..
ప్రస్తుతం కింగ్డమ్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే నాగ వంశీ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక విజయ్ దేవరకొండ కూడా ప్రచార కార్యక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి కింగ్డమ్ బాయ్ పేరిట స్పెషల్ చిట్ చాట్ ను నిర్వహించి వీడియోను విడుదల చేశారు. సినిమాలోని కీలక అంశాలపై చర్చించారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పీచ్ ఆసక్తికరంగా మారింది.

ఆ ఏడుకొండల స్వామి నా వెనకాల ఉంటే..
విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆసక్తికరంగా మాట్లాడారు. ఇప్పటి వరకు నేను ఇలా మాటలు చెప్పలేదు. గతేడాది నుంచి ఈ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటే నా తలలో ఒక్కటే తిరుగుతోంది. నా మనస్సులో గట్టిగా ఒకటే అనిపిస్తోంది. మన తిరుపతి ఏడుకొండల స్వామి ఈ ఒక్కసారి గనుక నా వెనకాల ఉండి నడిపిస్తే మాత్రం చాలా పెద్దొడిని అయ్యిపోతా. టాప్ లో పోయి కూర్చొంటా.. అని విజయ్ దేవరకొండ పుష్ప 2 చిత్రంలోని డైలాగ్ ను రిపీట్ చేస్తూ సినిమా ఫలితంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

భారీ బడ్జెట్ తో కింగ్డమ్..
విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ బోర్సే, సత్యదేవ్ వంటి స్టార్ కాస్ట్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. మిగితా క్రాఫ్ట్ లోనూ అనుభవం కలిగిన టెక్నీషియన్లు వర్క్ చేయడంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 150 కోట్ల వరకు ఖర్చైందని మేకర్స్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X