ఒక్కో అమ్మాయి ఫుల్ ఫామ్‌లో ఉంది.. మస్త్ ఎంజాయ్ చేసిన: విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ తాజా సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా నిన్న(ఆదివారం) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మరోసారి మాటల గారడీ చేశాడు. ఆ వివరాలు చూద్దామా..
Recommended Video

నలుగురు అందాల భామల నడుమ వరల్డ్ ఫేమస్ లవర్
'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ఏకంగా నలుగురు అందాల భామలు ఆడిపాడారు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లా, కాథరిన్ ట్రెసా లతో ఈ సినిమాలో యూత్ ఆడియన్స్‌ని కావాల్సినంత రొమాన్స్ పండించారట విజయ్ దేవరకొండ. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ ఈ విషయాన్ని చెప్పేశాయి.

అందాల తారలతో విజయ్ ఎక్స్‌పీరియన్స్
అయితే తాజాగా జరిగిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ నలుగురు అందాల తారలతో తన ఎక్స్‌పీరియన్స్ చెబుతూ రక్తి కట్టించారు విజయ్ దేవరకొండ. నలుగురు హీరోయిన్స్ ఒక్కొక్కరి గురించి చెబుతూ వేదిక ప్రాంగణాన్ని హూషారెత్తించారు మన రౌడీ స్టార్.

నాలుగు రకాల లవర్స్‌తో ఎంజాయ్ చేశా.. మళ్ళీ ఆ ఛాన్స్ రాదు
మూడు రకాల మనిషిగా నటించి.. నాలుగు రకాల లవర్స్‌తో ఎంజాయ్ చేశానని విజయ్ దేవరకొండ అన్నారు. ''పల్లెటూరిలో భార్యాభర్తల ప్రేమకథ, ఫారెన్ లో ఓ తెల్లపిల్లతో లవ్, హైదరాబాద్ కాలేజీ అమ్మాయితో ప్రేమ.. ఇలా అన్ని రకాల విచిత్రమైన క్యారెక్టర్ చేశా. నాకు తెలిసి ఇలాంటి ఛాన్స్ నాకు మళ్ళీ రాదు'' అన్నాడు విజయ్ దేవరకొండ.

బొగ్గుగనిలో, ఫారన్‌లో.. పార్ట్నర్స్ బాగా సపోర్ట్ చేశారు
బొగ్గుగనిలో శీనయ్యలా నేను ఉండలేను. ఫారన్ ఎపిసోడ్‌లో గౌతమ్ రోల్ మస్త్ మజా ఇచ్చింది. ఒక టీం గెలవాలంటే ఒక్కరు ఆడితే సరిపోదు.. పార్ట్నర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఆడాలి. ఈ సినిమాలో నాతో హీరోయిన్స్‌గా నటించిన నలుగురు అమ్మాయిలు ఫుల్ ఫామ్‌లో ఉండి సూపర్ సపోర్ట్ చేశారు అని చెప్పాడు విజయ్.

మళ్లీ ప్రేమలో పడ్డా అనేసిన రౌడీ స్టార్
రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇసాబిల్లా వీళ్లంతా కెరియర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. చాలా బాగా నటించారు. నిన్ననే ఈ సినిమా చూస్తున్నప్పుడు మళ్లీ వీళ్ల ప్రేమలో పడ్డా అంటూ చమత్కరిస్తూ తనదైన స్టైల్ మాటలతో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ నలుగురు భామలతో మన రౌడీ స్టార్ ఏ రేంజ్‌లో కిక్కిస్తాడో ఫిబ్రవరి 14న చూడాలి.


Click it and Unblock the Notifications











