Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ షాకింగ్ డెసిషన్.. ఆనంద్ కోసం ఆ పని కూడా చేస్తాడట
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో క్రేజ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ను దక్కించుకున్నాడు. అదే సమయంలో సరికొత్త స్టైల్స్‌ను తెలుగు వాళ్లకు పరిచయం చేస్తున్నాడు. ఒక దాని తర్వాత ఒక సినిమా చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. దీని తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాలో నటించనున్నాడు. ఈ క్రమంలోనే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట.
నలుగురిని ప్రేమిస్తున్నాడు
విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య రాజేష్, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో విజయ్ నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు
దీని తర్వాత విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో తెరకెక్కించనున్నారని ఈ మధ్య ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీని ద్వారా విజయ్ బాలీవుడ్‌లోకి ఎంటర్ అవబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘ఫైటర్' అనే టైటిల్ అనుకుంటున్నారు.
తమ్ముడిని కూడా పరిచయం చేశాడు
విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కొద్ది రోజుల క్రితం ‘దొరసాని' ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయినప్పటికీ ఆనంద్‌కు మాత్రం మంచి పేరు తెచ్చింది. ఇందులో అతడి నటన విమర్శకులను సైతం ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా.. మెచ్యూరిటీతో నటించాడని చాలా మంది కొనియాడారు.
ఆనంద్ కోసం విజయ్ త్యాగం
దొరసాని సినిమా విడుదలై చాలా రోజులు గడుస్తున్నా.. ఆనంద్ తన రెండో సినిమాను ప్రకటించలేదు. వాస్తవానికి గతంలో అతడి రెండో మూవీపై వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ తన తమ్ముడి కోసం ఓ కథను త్యాగం చేశాడని అప్పుడు ప్రచారం జరిగింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు.
సూపర్ హిట్ సినిమాకు రీమేక్
ఆనంద్ దేవరకొండ చేసే రెండో సినిమాపై ఇటీవల వార్త బయటకు వచ్చింది. శ్రీకాంత్, శ్వేత, స్నేహ, స్వాతి కాంబినేషన్లో 1997లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘తాళి' అనే సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని అన్నారు. ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మలచి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని టాక్ వినిపించింది.
విజయ్ షాకింగ్ డెసీషన్
తన తమ్ముడు కోసం విజయ్ ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం.. ఆనంద్‌తో చేయబోయే సినిమాలో తాను కూడా నటిస్తానని కొందరు ఫిల్మ్ మేకర్లకు ఆఫర్ ఇచ్చాడట. అంతేకాదు, అందుకోసం రెమ్యూనరేషన్ కూడా తక్కువగానే తీసుకుంటానని ప్రకటించాడని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.