Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మాస్ వార్నింగ్.. నన్ను ఎవడైనా గెలికితే రివర్స్ వెళ్తాంటూ..

Vijay Deverakonda: రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ సినిమా మంచి స్పందనతో థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం, విడుదలైన కొన్ని రోజుల్లోనే మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయోత్సవంలో విజయ్‌ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ హైలెట్ గా నిలిచింది. సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?

గర్ల్ ఫ్రెండ్ వేడుకల్లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ 'ఈరోజే సినిమా చూసా. నన్ను ఎమోషనల్ అయ్యేలా చేసింది. చాలా చోట్ల కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా దగ్గరలో లోపల బరువైన, టైట్ ఫీలింగ్. కొన్ని సమయంలో డిస్కంపర్ట్ అయిపోయి కదులుతూ, కూర్చొన్నా కూడా స్థిరంగా ఉండలేకపోయా. ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్‌ ఫిల్మ్స్‌లో ఇదే ఒకటి' అని భావోద్వేగంగా చెప్పారు.

Vijay Deverakonda Speech at Rashmika Mandanna The Girlfriend Success Celebrations

సినిమా చూపించిన పరస్పర సంబంధాలపై సంగతుల గురించి విజయ్ మాట్లాడుతూ..'సినిమాల్లో చూపించినట్లు అలాంటి రిలేషన్స్లలో ఉన్నవారికి నిజంగా సారీ. అలాంటి రిలేషన్షిప్ చూసి చాలా బాధ అనిపించింది. మీరు ఎక్కడైనా ఆఫీసులో గానీ, లేదా పని చేసే ఇతర ప్రదేశాల్లో గానీ ఇతరుల పట్ల రిస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఫ్రెండ్‌లీ రిలేషన్ షిప్ మైంటైన్ చేయాలి" అన్న తన ఆలోచనలు పంచుకున్నారు.

"రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులున్నాయని వాటిని విడిచిపెట్టమని నేను అసలు చెప్పట్లేదు. కానీ మన బంధం ఒక రకం ఫ్రెండ్లీ రక్షణగా ఉండాలి. జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్లో భరోసా ఇవ్వాలి. మనం మన పార్టనర్‌తో ఓపెన్‌గా, నిజంగా మాట్లాడాలి. అప్పుడే మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది" అని స్పష్టత ఇచ్చారు. రక్షణ అందించాల్సిన భావన వల్ల అది నియంత్రణగా మారకూడదని, మనం మన పార్ట్నర్‌కి రక్షణగా అనిపించాలనుకుంటాం.. కానీ, ఆ రక్షణ వాళ్లని కంట్రోల్ చేసేలా ఉండకూడదు' అని అన్నారు.

విజయ్ ఇక మాట్లాడుతూ..'వారికి కూడా కొన్ని కలలు, సంతోషాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ఇద్దరి జీవితాల్లో ఉన్న మంచి జ్ఞాపకాలు ముఖ్యం. పుట్టడం, చావడం మన ఛాయిస్ కాదు.. మధ్యలో ఉన్న జీవితం మన ఛాయిస్. ఈ చిన్న స్పేస్‌ను మనకు నచ్చిన విధంగా వాడుకుందాం. జీవితం చాలా చిన్నది.. అందరితో సరదాగా గడుపుదాం" అని పేర్కొన్నారు.

అనంతరం రష్మిక గురించి మాట్లాడుతూ "నేను రష్మికను 'గీత గోవిందం' ఫిల్మ్ టైమ్ నుంచి చూస్తున్నాను. ఈమె ఎగ్జాక్ట్ గా భూమాదేవిలా ఉంటుంది. ఆమెలో తెలియని అమాయకత్వం, ఏ రోజు కూడా రష్మిక తన గురించి ఆలోచించదు. సెట్ లో అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచిసుంది. ఇప్పటికీ ఆమె అలానే ఉంది. అక్కడి నుంచి మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు తనకి తానుగా ది గర్ల్ ఫ్రెండ్ లాంటి బలమైన స్క్రిప్ట్‌లను ఎంచుకునే స్థాయికి వచ్చింది. ఎవరు చూస్తారో తెలియదు కానీ.. చూసిన వాళ్లకి మాత్రం ఇటువంటి కథలను చెప్పాలని అనుకుంటుంది. రషి.. నీ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది" అని ప్రశంసల వర్షం కురిపించారు.

'నన్ను ఎవడైనా గెలికితే నేను రివర్స్‌లో వెళ్తా. కానీ రషి మాత్రం.. ప్రపంచం ఎన్ని మాటలన్నా, ఏం అన్నా.. వాటిని అసలు పట్టించుకోదు. ఇతరుల పట్ల దయతో ఉంటుంది. ఈ ప్రపంచం నన్ను మార్చకూడదు అనుకుంటుంది. చాలా ప్రశాంతంగా తన పని తానే చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తూనే ఉంది. రషి నిజంగా నువ్వు అమేజింగ్‌ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్‌ సినిమాల్లో ఇదీ ఒకటి. దర్శకుడు రాహుల్‌ రవీంద్ర అద్భుతంగా సినిమా తీశాడు''అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X