మనిషిలా కొంచెం మారుతున్నా.. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా: విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్ ఇస్తూ ఆసక్తి పెంచేసిన చిత్రయూనిట్.. ఇటీవలే ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పాడు.

తన సినిమా అంటే హడావుడి, ఎగ్జైట్‌మెంట్ ఒక రేంజ్‌లో ఉంటుందని అన్నాడు విజయ్ దేవరకొండ. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడు? వీడితో నలుగురు హీరోయిన్లు ఎందుకు చేస్తున్నారని ఎగ్జిబిటర్స్‌లో, డిస్ట్రిబ్యూటర్స్‌లో ఎగ్జైట్‌మెంట్ ఉంటుందని చెప్పాడు. తాను చేసిన సినిమాలన్నింటిలో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోనే ఎక్కువ కష్టపడ్డానని అన్నాడు. ''నాకు తెలుసు.. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్‌గా లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. నా లాస్ట్ లవ్ స్టోరీలో నలుగురు బ్యూటిఫుల్ విమెన్‌తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది'' అన్నాడు విజయ్.
ఫిబ్రవరి 14న ఈ కంప్లీట్ ప్యాకేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ 47వ చిత్రం బిగ్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. క్రాంతిమాధవ్‌కు ఈ సినిమాతో అతిపెద్ద సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అని చెప్పాడు విజయ్ దేవరకొండ.


Click it and Unblock the Notifications











