ఇదే చివరి లవ్ స్టోరీ.. అందుకే అంతా అలా నింపేశాము.. విజయ్ దేవరకొండ కామెంట్స్
Recommended Video
విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్‌లో ఓ బ్రాండ్. ఒంటి చేత్తో సినిమాను విజయ తీరాలకు మోసుకుపోగల సత్తా ఉన్న నటుడు. వరుస విజయాలతో దూకుడు మీదున్న విజయ్‌కు మధ్యలో ఫ్లాప్‌లు వచ్చినా కుంగిపోలేదు. అపజయం ఎదురైన ప్రతీసారి అంతకు మించి పైకి లేశాడు. చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్ నిరాశ పరిచినా.. ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.

వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ..
సెన్సిబుల్ డైరెక్టర్ అయిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాబోతోన్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్, ఇజబెల్లా ఇలా నలుగురు కథానాయికలతో రోమాన్స్ చేయనున్న విజయ్.. భారీ హైప్ క్రియేట్ చేశాడు. టీజర్‌తో వేడి పుట్టించిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఆకట్టుకుంటోన్న ట్రైలర్..
నాలుగు ప్రేమ కథలను, నాలుగు రకాలుగా చూపించేందుకు క్రాంతి మాధవ్ సిద్దమయ్యాడు. ప్రేమలో ఉండే బాధను, పిచ్చిని, సంతోషాన్ని ఇలా ప్రతీ ఎమోషన్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఎప్పటిలానే విజయ్ తన పాత్రల్లో జీవించినట్టు తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో చూడాలి.

విజయ్ సినిమా అంటే ఓ హడావిడి..
వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడుతూ.. తన సినిమా అంటే ఓ హడావిడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో వీడు కొత్తగా ఏం చేశాడా? అని పబ్లిక్‌లో నిర్మాతల్లో ఇలా అందరిలోనూ ఓ ఎగ్జైట్మెంట్ ఉంటుందని తెలిపాడు. మామూలుగా ఇద్దరు హీరోయిన్లంటేనే అందరూ కొట్టుకుంటారని.. ఇలా నలుగురు హీరోయిన్లు ఎందుకా? అని అందరూ ఆత్రుతగా చూస్తారని అన్నాడు.

అప్పుడు మాట్లాడుతా..
చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాకు పనిచేశామని తెలిపాడు. అయితే ఈ సినిమాకు ఎలాంటి హడావిడి ఏం చేయలేదు.. మామూలుగానే వచ్చానని, ట్రైలర్ లాంచ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 9న ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతానని చెప్పుకొచ్చాడు..

ఇదే చివరి లవ్ స్టోరీ..
బహుషా ఇదే తన చివరి ప్రేమ కథా చిత్రమని చెప్పుకొచ్చాడు.తన చివరి ప్రేమ కథలో ఇలాంటి వాళ్లందరూ నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా, కేథరిన్, ఇజబెల్లా ఇలా వాళ్లు తమ నటనతో చంపేశారని అన్నాడు. ఇది చివరి చిత్రం కాబట్టి.. పూర్తిగా ప్రేమతో నింపి పడేశామని చెప్పుకొచ్చాడు. ఇది తనకు మారుతున్న ఫేజ్ అని.. బహుషా ఇదే చివరి ప్రేమ కథా చిత్రమని పేర్కొన్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.


Click it and Unblock the Notifications











