మైత్రి నిర్మాతలతో ముంబై వెళ్లిన విజయ్ దేవరకొండ.. కారణం అదేనా?
సౌత్ ఇండియాలో అనతి కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఫాన్స్‌గా మలచుకొని భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు. ''అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా'' లాంటి వరుస హిట్స్ ఆయన్ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ ముంబై ఎయిర్ పోర్ట్‌లో దర్శనమివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మైత్రి నిర్మాతలతో కలిసి ముంబై వెళ్ళాడు విజయ్ దేవరకొండ. ఎయిర్ పోర్ట్‌లో విజయ్‌ని చూసి బాలీవుడ్ జనం సైతం ఎగబడటం విశేషం. అందరితో సెల్ఫీ దిగారు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ ఉన్నట్టుండి ముంబై ఎందుకు చేరుకున్నాడనే దానిపై ఆసక్తికర కథనాలు పుట్టుకొస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి నిర్మాతలు బాలీవుడ్ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారని, ఈ మేరకు డైరెక్టర్‌ని కలవడానికే వారు ముంబై చేరుకున్నారని గాసిప్స్ ఊపందుకున్నాయి. బ్లాక్ కలర్ జాకెట్ ధరించి గడ్డం లుక్‌తో విజయ్ అక్కడి జనాన్ని ఆకట్టుకున్నాడు. ఇటీవలే విజయ్ దేవరకొండ సినిమా 'అర్జున్ రెడ్డి'.. బాలీవుడ్ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయి భారీ హిట్ సాధించడం కొంతవరకు బాలీవుడ్ లో ఆయన క్రేజ్ పెంచేసింది.

ఇక విజయ్ దేవరకొండ ప్రెసెంట్ మూవీ డియర్ కామ్రేడ్ విషయానికొస్తే.. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. జులై 26 వ తేదీన డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











