రౌడీ బేబీస్.. గెట్ రెడీ.. ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ మరో గిఫ్ట్

టాలీవుడ్‌లో అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరో స్టాటస్ దక్కించుకొన్న సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ సెన్సేషనల్ సక్సెస్‌లను అందుకొంటున్నాడు. తెలుగులో ఏ హీరోకు దక్కని పాపులారిటీ దక్షిణాది రాష్ట్రాల్లో సొంతం చేసుకొన్నాడు. తన అభిమానులకు చేరవయ్యేందుకు ఇప్పటికే రౌడీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు మరో అడుగు ముందేసి విజయ్ దేవర కొండ ఫ్యాన్స్ క్లబ్ అనే (www.vdfans.club) పేరుతో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించబోతున్నాడు.

విజయ్ దేవరకొండ అభిమానులకు కావాల్సిన పక్కా సమాచారం.. జెన్యూన్ కంటెంట్‌ను అందజేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సినిమాకు సంబంధించిన సమాచారం. రిలీజ్ డేట్స్, కలెక్షన్లు, ఒపెనింగ్ వసూళ్లు, ఫోటోలు, వీడియోలు, ట్రైలర్లు, టీజర్లు లాంచ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్‌సైట్ అధికారికంగా అందుబాటులోకి రానున్నది.

Vijay Deverakonda starts VDfansclub website

ఇక విజయదేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే మైత్రీ మూవీస్ నిర్మించే హీరో చిత్రంలో నటిస్తూనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

ఇక ఇటీవల వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకొన్న విషయం తెలిసిందే. క్రిటిక్స్ రివ్యూలను ఎదురించి భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X