Vijay Deverakonda దటీజ్ రౌడీ స్టార్.. 100 మందికి 10000 చొప్పున గిఫ్ట్
అభిమానులను ఆకట్టుకోవడంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటారు. ఆనందంలోను, కష్టాల్లోను ఫ్యాన్స్ తోడుంటానని పలుమార్లు ఈ యువ హీరో నిరూపించాడు. ఇటీవల క్రిస్మస్ పండుగ సందర్భంగా అభిమానులకు ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకొన్నాడు. క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవరశాంటా పేరుతో 100 మందికి బహుమతులు అందజేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించాడు.
విజయ్ దేవరకొండ సోషల్ మీడియా పోస్టుకు విశేష స్పందన లభించింది. వేలాది మంది విజయ్ ట్వీట్‌కు రెస్పాండ్ అయ్యారు. అలా రెస్పాండ్ అయిన వారిలో 100 మందికి గిఫ్ట్ అందించేందుకు రెడీ అయ్యాడు. తాజాగా చెప్పిన మాటను నిజం చేస్తూ ప్రతీ ఒక్కరికి 10 వేల రూపాయలను పంచేందుకు సిద్దమయ్యారు.

కరోనావైరస్ కారణంగా లైగర్ షూటింగ్ వాయిదా పడటంతో విజయ్ దేవరకొండ ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులతో తన అనుభూతులను పంచుకొంటున్నారు. ఇటీవల మై లవ్స్ దేవరశాంటా అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. లక్కీ విజేతల జాబితాలో మీ పేరు ఉందో చెక్ చేసుకోండి.. త్వరలో మా టీమ్ మీతో సంప్రదించి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రిస్మస్ పండుగకు తన అభిమానులకు బహుమతులు అందజేస్తున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆయన నగదు రూపంలో బహుమతులు ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 100 మందికి 10 లక్షల రూపాయలను దేవరశాంటా పేరుతో పంచుతున్నారు.


Click it and Unblock the Notifications











