‘జెర్సీ’ గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్, ఏమన్నాడంటే..
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'జెర్సీ' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుని దూసుకెళుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ 'జెర్సీ' మూవీ విజయంపై స్పందించారు. ఈ సినిమాను తాను ఎంత లవ్ చేస్తున్నానో ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. నాని గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.
'జెర్సీ నాకు ఎంతగానో నచ్చింది. అర్జున్ పాత్రకు నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమా చూసిన తర్వాత నాని మీద లవ్ మరింత పెరిగింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎంతో అద్భుతంగా తీశారు' అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.
నాని ఈ చిత్రంలో తన క్రికెట్ ఆటతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆయన 'హైదరాబాద్ సన్ రైజర్స్' టీంకు ఆడాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ నాని చేసిన ఈ కామెంట్ వైరల్ అయింది.

'జెర్సీ'లో అర్జున్ అనే రంజీ క్రికెటర్ పాత్రలో నాని నటించారు. అద్భుతమైన ఆటగాడైన అర్జున్ 26 ఏళ్ల వయసులో కొన్ని కారణాలతో క్రికెట్‌కు దూరం అవుతాడు. రిటైర్మెంట్ ఏజ్(36)లో మళ్లీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఇన్నాళ్లు క్రికెట్‌కు ఎందుకు దూరం అయ్యాడు అనే కథను దర్శకుడు ఎమోషనల్ వేలో చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











