రఫ్ లుక్‌లో విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ రిలీజ్, అర్జున్ రెడ్డి 2.0..

ఇటీవలే 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన విజయ్ దేవరకొండ ఈ సారి మరింత స్ట్రాంగ్‌గా దిగాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ వరల్డ్ ఫేమస్ లవర్ అని ప్రకటించి ఆసక్తి రేకెత్తించిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

రఫ్ లుక్‌లో విజయ్..

రఫ్ లుక్‌లో విజయ్..

ఈ ఫస్ట్ లుక్‌లో విజయ్ దేవరకొండ చాలా రఫ్‌గా కనిపించాడు. చేతిలో సిగరేట్ పట్టుకుని.. ముఖంపై గాయాలతో కనిపిస్తున్న విజయ్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మారింది. ఆవేశంగా అరుస్తున్నట్లు కనిపిస్తున్న ఈ లుక్‌లో ఇంటెన్స్ కనిపిస్తోంది.

వరల్డ్ ఫేమస్ లవర్‌గా.. 4 షేడ్స్..

గత కొంతకాలంగా ఈ సినిమాకు 'లవర్' అనే టైటిల్ ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికి దగ్గరగానే, కాస్త డిఫెరెంట్‌గా ఉండేలా ఫిక్స్ చేసి ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నాలుగు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషిస్తుండటం విశేషం.

అర్జున్ రెడ్డి 2.0

అర్జున్ రెడ్డి 2.0

ఇక అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ కూడా ఇప్పుడు విడుదలైంది. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీంతో మరాన మాస్, సూపర్ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి 2.0 అంటూ ట్వీటెత్తిస్తున్నారు.

విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు

విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశిఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా కూడా మరో ముగ్గురు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ డిఫెరెంట్‌గా ఉంటుందని, ఆయన ఓ రైటర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

శరవేగంగా షూటింగ్..

శరవేగంగా షూటింగ్..

క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X