అర్జున్ రెడ్డిని మించేలా... వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం అంతకంతకూ అంచనాలను పెంచుకుంటూ పోతోంది. డియర్ కామ్రేడ్ సినిమా అంతగా మెప్పించలేకపోయినా.. విజయ్ చిత్రాలకు మాత్రం గిరాకీ తగ్గలేదు. విజయ్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే పోతోంది. జయాపజయాల గురించి ఆలోచించే తీరిక లేనంత బిజీగా ఉన్నాడు విజయ్. ప్రస్తుతం మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే తన ప్రియురాళ్ల వివరాలను ప్రకటించి అంచనాలను పెంచేశాడు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్, ఇసబెల్లాలు కథానాయికలుగా నటిస్తుండగా.. వీరితో విజయ్ రొమాన్స్ చేయనున్నాడు. వీరి మధ్య కెమిస్ట్రీనే ఈ చిత్రానికి హైలెట్ కానున్నట్లు పోస్టర్లు చూస్తుంటే అర్థమవుతున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది యూనిట్.

Vijay Deverakonda World famous Lover Teaser Released

అర్జున్ రెడ్డిని మించేలా... వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ ఉంది. ప్రేమలోని సున్నితత్వాన్ని, రొమాంటిక్ యాంగిల్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రేమ అంటే కాంప్రమైజ్ కాదు.. ప్రేమ అంటే సాక్రిఫైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావు.. అనే డైలాగ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కేఎస్ రామారావు సమర్పిస్తుండగా.. కేఏ వల్లభ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రేమికుల రోజున విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X