Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యాన్సీ రేట్‌కు వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. మధ్యలో నోటా వంటి చిత్రాన్ని చేసినా, రీసెంట్‌గా డియర్ కామ్రేడ్ అంటూ మిశ్రమ ఫలితాన్ని అందుకున్నా.. విజయ్ క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. విజయ్ ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ద ప్రేమికుడిగా కనిపించబోతోన్నాడు. విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది.

డియర్ కామ్రేడ్‌తో దక్షిణాన..
సౌత్‌లోని అన్ని భాషల్లో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని రిలీజ్ చేసి.. సౌత్ స్టార్‌గా ఎదిగే ప్రయత్నం చేశాడు విజయ్. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో నిరాశే మిగిలింది.
అయినా విజయ్ క్రేజ్ మార్కెట్‌లో ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

నలుగురు భామలతో సందడి..
సెన్సిటివ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్, ఇసబెల్లా కథానాయికలుగా నటిస్తోన్నారు. వీరందరితో నడిపే ప్రేమాయణం సరికొత్తగా ఉంటుందని, ఎంతో ఎమోషనల్‌గా సాగుతుందని తెలుస్తోంది.

ప్రేమికుల రోజున..
ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేద్దామా? అని ఆలోచించిన చిత్రయూనిట్.. ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్దమైంది. సరైన సమయం ఎదురు చూసిన కోసం చిత్రబృందం.. లవర్స్ డేన రిలీజ్ చేయడం కలిసొచ్చే అంశమని తెలుస్తోంది.

ఫ్యాన్సీ రేట్‌కు హక్కులు..
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. విజయ్ దేవరకొండకు యూత్‌లో క్రేజ్ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ఆయన చిత్రాల థియేట్రికల్ రైట్స్ కొరకు డిస్ట్రిబ్యూటర్స్ అమితమైన ఆసక్తి చూపిస్తారు. కాగా వరల్డ్ ఫేమస్ లవర్ ఆంధ్రా హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దక్కించుకున్నట్లు నిర్మాత ప్రకటించాడు. ఈ చిత్ర ఆంధ్ర హక్కులకు కొరకు ఫ్యాన్సీ ధర చెల్లించి ఆయన సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె ఎస్ రామారావు సమర్పిస్తుండగా వల్లభ నిర్మిస్తున్నారు.