Allu Arjun కు రౌడీ విజయ్ దేవరకొండ గిఫ్టు.. పుష్ప రిలీజ్‌కు ముందు ఏం పంపారంటే?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవర్‌ఫుల్ కంటెంట్‌తో కూడిన పుష్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిసెంబర్ 17న రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు సన్నిహితుడైన విజయ్ దేవరకొండ అద్భుతమైన బహుమతిని అందజేశారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అన్నయ్య అంటూ తన అభిమానాన్ని విజయ్ దేవరకొండ చాటుకోవడం తెలిసిందే. విజయ్ దేవరకొండను మొదటి నుంచి ప్రోత్సహిస్తుండటం తెలిసిందే. అయితే పుష్ప రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్‌లో పాల్గొంటున్న బన్నీకి టీషర్టును విజయ్ దేవరకొండ పంపించారు. రౌడీ క్లబ్ బ్రాండ్ నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన బట్టలను పంపించినందుకు ఇన్స్‌టాగ్రామ్ ద్వారా మై డియర్ బ్రదర్ విజయ్ దేవరకొండ అంటూ థ్యాంక్స్ చెప్పారు.

విజయ్ దేవరకొండ ధరించిన టీషర్ట్‌ను ధరించిన ఫోటోను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి షేర్ చేశారు. రెడ్డి లవ్స్ అల్లు అర్జున్, రౌడీ లవ్స్ అల్లు అర్జున్ అంటూ కామెంట్ పెట్టింది.
ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. లైగర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఇటీవలే దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌తో బాక్సింగ్ పోరాటాలను అమెరికాలో ముగించుకొని ఇటీవలే హైదరాబాద్ చేరుకొన్నారు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది.


Click it and Unblock the Notifications











