World Famous Lover Trailer: మీ ఆడోళ్లకు అసలు ఆగదా? ఓ రేంజ్‌లో విజయ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ మూవీ లవర్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నది. ఈ క్రమంలో వరల్డ్ ఫేమస్ మూవీ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే..

స్వార్ధం ఏదైనా ఉందంటే..

స్వార్ధం ఏదైనా ఉందంటే..

ఈ ప్రపంచంలో స్వార్ధం ఏదైనా ఉందంటే ప్రేమలోనే.. ఆ ప్రేమలో నేను అనే రెండు అక్షరాలు సునామీనే సృష్టించగలదు. అందుకే ఐ వాంటెడ్ టు బీ వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తోపాటు ఆసక్తికరమైన విజువల్స్‌తో వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ మొదలవుతుంది. యూత్‌లో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ట్రైలర్ రూపొందించినట్టు స్పష్టమవుతుంది. ఈ ట్రైలర్‌లో రకరకాలు గెటప్స్‌లో విజయ్ దేవరకొండ కనిపించడం అభిమానుల్లో జోష్‌ను పెంచడం ఖాయమనిపిస్తుంది.

మీ ఆడోళ్లకు అసలు ఆగదా?

ఇక మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ట్రైలర్‌లో మసాలా డైలాగ్స్ పెట్టినట్టు అనిపించింది. మీ ఆడోళ్లకు అసలు ఆగదా? బట్ట కొంటే ఒంటి మీద వేసేయడమేనా? అంటూ ఐశ్వర్య రాజేశ్‌ను దృష్టిలో పెట్టుకొని మంచంలో పడుకొని విజయ్ దేవరకొండ చెప్పడం ఇంట్రస్టింగ్ అనిపిస్తుంది.

రొమాన్స్‌కు క్యాథరీన్ త్రెసా

రొమాన్స్‌కు క్యాథరీన్ త్రెసా

ఇక క్యాథరీన్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ.. మేడమ్‌కు మైన్స్ చూపించాలంట.. నేను పోతున్నాను... అంటూ చెప్పిన డైలాగ్స్ రొమాన్స్‌కు సినిమాలో పెద్ద పీట వేసినట్టు అనిపించింది. ఆర్ యూ మ్యాడ్.. పెళ్లంటే జోకా? అంటూ చెప్పిన డైలాగ్స్ సినిమాలోని ఇంటెన్సిటీని చెప్పేందుకు వరల్డ్ ఫేమస్‌ లవర్‌లో ప్రయత్నించారు.

ఎమోషనల్‌గా డైలాగ్స్

ఎమోషనల్‌గా డైలాగ్స్

నీ యవ్వ తంతే కిటికిలో పడుతావు? ఎవరు ఏది ప్రేమిస్తారో.. అది వాళ్లకు దక్కాలి. మై మైండ్, బై హార్ట్ బ్లీడింగ్.. జీవితం కమ్మగుందా మామా అంటూ చెప్పిన డైలాగ్స్ ఎమోషన్స్‌ను పలికించాయి. నా ముక్కు, మూతి, తోలు మారిందా? మీ ఇంట్లో కొట్టుకోరా? నీ ఇంట్లో భార్య భర్తలు కొట్టుకోరా? నా గుండెకు తాకిన దెబ్బకు నొప్పి తెలియకుండా ఉండాలంటే.. ఫిజికల్‌గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి అంటూ చెప్పిన విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ నిచ్చేలా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X