‘ఎవరినీ ప్రేమించను.. పెళ్లి చేసుకోను.. నచ్చినవాడితో సహజీవనం చేస్తా’ త్రిష వీడియో వైరల్

తమిళ స్టార్ హీరో దళపతికి విజయ్ ఉహించని షాక్ తగిలింది. ఆయన ఆయన భార్య సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధాన్ని తాను ఇకపై కొనసాగించలేనని పేర్కొన్నారు. తన పిటిషన్ లో 2021 నుంచి ఓ నటితో తన భార్త విజయ్ కి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. అయితే.. ఆ నటి ఎవరు అనేది మాత్రం ప్రస్తావించలేదు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ త్రిష పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో త్రిష గతంలో చేసిన కామెంట్స్, ఆమె పాత వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో త్రిష ట్రెండ్
విజయ్-సంగీత విడాకుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే, త్రిష కృష్ణన్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. గతంలో విజయ్ బర్త్‌డే సందర్భంగా త్రిష చేసిన పోస్టులు, వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫోటోలు, తిరుప్పాచ్చి, గిల్లి వంటి సినిమాల ప్రమోషన్ సమయంలో త్రిష నా లక్కీ చార్మ్ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ భర్త సంగీత విడాకులు కోరడానికి త్రిష నే కారణం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లపై ఇటు విజయ్ గానీ, అటు త్రిష గానీ అధికారికంగా స్పందించలేదు.

Vijay Divorce Controversy Trisha s Past Marriage Comments Go Viral

ఈ వివాదం నేపథ్యంలో హీరోయిన్ త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. ' మీ పెళ్లి ఎప్పుడని చాలా మంది అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. ఎందుకంటే.. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు అభ్యంతరం లేదు' అని స్పష్టం చేశారు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం చేసే నిర్ణయం కాదని, జీవితాంతం కలిసి ఉండగలిగే వ్యక్తిని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆమె అభిప్రాయపడింది. అలాగే విడాకుల గురించి మాట్లాడుతూ.. 'నేను పెళ్లి చేసుకుంటే విడాకుల కోసం వెళ్లాలనుకోవడం లేదు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోను'అని తెలిపారు.

'నా స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని, అఇష్టంగా జీవితాలను గడుపుతున్నారు. కానీ, నేను అలాంటిది జీవితాన్ని కోరుకోవడం లేదు. సరైన వ్యక్తి కోసం వేచి ఉంటాను. అలాగే.. ఇష్టంలేని వ్యక్తితో కలిసి బతకడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది' అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో 'నేను ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. కానీ, నాకు జీవిత భాగస్వామి కావాలి. నచ్చిన వాడితో నా జీవితాన్ని పంచుకోవాలి. అలాంటి వ్యక్తి కావాలి' అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.

ఈ వ్యాఖ్యలను ఇప్పుడు చాలా మంది విజయ్ విడాకుల నేపథ్యంలో మళ్లీ షేర్ చేస్తున్నారు. 'ఇష్టంలేని వ్యక్తితో కలిసి బతకడం కంటే వేచి ఉండటం మంచిది'అనే ఆమె ఆలోచనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. త్రిష వ్యక్తిగత జీవితం పరిశీలిస్తే.. 2015లో చెన్నై వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని నెలల్లోనే అది రద్దయింది. అప్పట్లో త్రిష సినిమాల్లో నటన కొనసాగించాలనే నిర్ణయంపై విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ఎంగేజ్‌మెంట్ రద్దు విషయాన్ని కూడా కొందరు సోషల్ మీడియాలో మళ్లీ లేవనెత్తుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో వేచిచూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X