తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం.. సంచలన విజయంపై సాయిధరమ్ తేజ్, నాని, రవితేజ కామెంట్స్
తమిళ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. అగ్ర నటుడిగా రికార్డు రెమ్యునరేషన్ అందుకొంటూ వరుస విజయాలు సాధిస్తూ కోట్లాది మంది అభిమానుల జేజేలు అందుకొంటున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి టీవీకే అనే రాజకీయ పార్టీని రెండు సంవత్సరాల క్రితం స్థాపించారు.
రెండేళ్ల వ్యవధిలోనే తమిళనాడు ప్రజల మన్ననలు అందుకొని అధికారం చేపట్టేందుకు సిద్దమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ విజయ ఢంకా మోగించి సీఎం పదవిని అధిష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సినీ హీరోలు నాని, రవితేజ, మంచు మనోజ్, సాయిదుర్గ తేజ్, నిఖిల్ తదితరులు తమ అభినందనలను సోషల్ మీడియా ద్వారా దళపతికి అందించారు. ఎవరెవరూ ఏమని ప్రశంసించారనే వివరాల్లోకి వెళితే..

నాని ట్వీట్ చేసి విజయ్‌ని అభినందించారు. కంగ్రాట్స్ విజయ్ సార్. తొలుత అనుమానపడ్డాం. ఆ తర్వాత రాజ్యాధికారం సిద్దించింది. ఇలాంటి పరిస్థితి మా రాష్ట్రంలోనూ చోటు చేసుకొన్నది. ఇప్పుడు మా పొరుగు రాష్ట్రంలో జరిగింది. అండర్ డాగ్ గెలువడం సినిమాల్లోనే కనిపిస్తుంది. కానీ రాజకీయాల్లోను ఇది సాధ్యమే అని రుజువు చేశారు. గొప్ప తీర్పు ఇచ్చిన తమిళ ప్రజలకు అంతా మేలు జరుగుతుందని ఆశావాదంతో ఉన్నాను అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
హీరో నిఖిల్ ట్వీట్ చేస్తూ.. భారతీయ సినిమా రంగం నుంచి వచ్చిన దళపతి విజయ్ గారు తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ముద్రను వేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆయన స్థాపించిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడమే కాకుండా చరిత్ర సృష్టించింది అని అన్నారు.
హీరో శర్వానంద్ స్పందిస్తూ.. కొన్ని ప్రయాణాలు గొప్పగా ఉంటాయని ఇదివరకే నేను చెప్పి ఉన్నాను. ప్రస్తుతం తమిళనాడులో అదే జరిగింది. చరిత్ర సృష్టించిన విజయ్ సార్ కంగ్రాట్యులేషన్. సినిమా నుంచి రాజకీయ రంగం వరకు కోట్లాది మంది ప్రజల మనసును దోచుకొన్నావు. ప్రజలకు మంచి చేయాలనే మీ లక్ష్యం నెరవేరాలని బలంగా కోరుకొంటున్నాను అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కొన్ని విషయాలు అలా జరిగిపోతాయని ముందే ఊహిస్తుంటాం. ఇది కూడా అలానే జరుగుతుందని బలంగా విశ్వసించాను సంచలన విజయం సాధించిన విజయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.పవర్‌ఫుల్ కొత్త ప్రయాయణంలో మీరు గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకొంటున్నాను. మీరు ముందుండి ప్రజలను ముందుకు నడిపించండి అంటూ రవితేజ తన ట్వీట్ ద్వారా అభినందించారు.
దళపతి విజయ్ గారికి హార్టీ కంగ్రాట్స్. తమిళనాడు పాలిటిక్స్‌లో మీ ప్రభావం చూడటానికి నిజంగా గొప్పగా ఉంది. ప్రజలు మీపై పెట్టుకొన్న నమ్మకం మీపై బాధ్యతను పెంచింది. ప్రజాస్వామ్యంలో గణనీయమైన మార్పు ఉంటుందని నమ్ముతున్నాం. మీ డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం మా హృదయాలను తాకింది. అతడు గెలుపు బాటలో ఉండటం మరింత ఆనందాన్ని కలిగించింది. మీ నిర్ణయాలు, విధానాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
విజిల్ వేసేయ్ విజయ్ అన్నా.. ఈ విజయం మీ ఎనలేని పట్టుదల, మీరు పడిన కష్టం వెలకట్టలేనిది. ఈ కృషికి సూచిక ఇది. వెండితెర దేవుడిగా మీరు డిఫరెంట్ ఇమేజ్‌ను చూపించావు. ప్రజల ప్రేమతో ప్రతీ ఒక్కరు తప్పని నిరూపించావు. మీపై నమ్మకంతో తమిళనాడు ప్రజలు మంచి మెజారిటీని అందించారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం ఎదురు చూస్తున్నాం. గొప్ప విజయాన్ని అందుకొన్న మీకు హృదయపూర్వక అభినందనలు. గొప్ప విషయాల కోసం ఎదురు చూస్తుంటాం అని సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో ప్రశంసలు కురిపించారు.


Click it and Unblock the Notifications